Top
Batukamma

తగ్గేదే లేదు.. బతుకో సావో... బరాబర్ ఇదే నా జిందగీ

తగ్గేదే లేదు.. బతుకో సావో... బరాబర్ ఇదే నా జిందగీ
X
Highlights

ఓ లక్ష్యం అంటూ పెట్టుకుంటే, అసలు నే పుట్టిందే ఇందుకు అనేంత బలంగా నమ్మి దిగితే.. అఫ్ కోర్స్ ఊరికే అలా సింపుల్ గా గెలవలేకపోవచ్చు. లక్ష అడ్డంకులు రావొచ్చు.

ఓ లక్ష్యం అంటూ పెట్టుకుంటే, అసలు నే పుట్టిందే ఇందుకు అనేంత బలంగా నమ్మి దిగితే.. అఫ్ కోర్స్ ఊరికే అలా సింపుల్ గా గెలవలేకపోవచ్చు. లక్ష అడ్డంకులు రావొచ్చు. వేల సమస్యలు ఎదురవ్వొచ్చు. ప్రయత్నిస్తున్న ప్రతీ సారీ ఇంకా ఇంకా కష్టాల్లో కూరుకుపోతున్నానే అనిపించొచ్చు. నీ నమ్మకం తప్ప నీకేదీ తోడు నిలబడలేకపోవచ్చు.

అయితె ఏంది? ఛల్.. తగ్గేదే లేదు. బతుకో సావో.. బరాబర్ ఇదే నా జిందగీ. ఏమన్న గానియ్. ఏందాకనైన వోనియ్ అనుకోని నువ్వైతే గట్టిగనే ఉండు, నిలవడి కొట్లాడు అని ధైర్యం చెప్పే సినిమా 'ఆకాశం నీ హద్దురా.'

సినిమా ఓవరాల్ గా పర్ ఫెక్ట్ టేకాఫ్ అండ్ సూపర్ పర్ ఫెక్ట్ ల్యాండింగ్.

నాకు బాగా నచ్చింది మాత్రం హీరో అండ్ హీరోయిన్ బాండింగ్ అండ్ వాళ్ళ మధ్య వచ్చే సీన్స్.

భార్యభర్తల్లా మామూలుగా మాట్లాడుకున్న సీన్ ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు.

బిజినెస్ డీలింగ్ కని బైటికెళ్ళి ఇంటికొచ్చిన భర్తకి అన్నం తినిపిస్తూ.. వాడి ప్రపోజల్ కి సరే అంటే ఇందులో విషం కలిపుండేదాన్ని అని చెప్పినపుడు ఆ సీన్ రాసిన సుధా కొంగరకి దండం పెట్టాలనిపించింది. ఎలా ఒస్తాయి తల్లీ అసలు ఇలాంటి థాట్స్?

మామూలుగా మణిరత్నం సినిమాల్లో హీరోయిన్ క్యారెక్టర్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయో తెలిసిందే.

ఆయన శిష్యురాలిగా సుధా గారు కూడా ఆ మార్క్ ని సక్సెస్ ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నారని మరోసారి ప్రూవ్ అయింది.

సూర్యకి సత్యదేవ్ డబ్బింగ్ మట్టుకు ఫస్టాఫ్ వరకు కొంచెం ఇన్ కన్వీనియెంట్ గా అనిపించింది (సెకండ్ హాఫ్ కి అలవాటైపోయింది)

ఇహ సూర్య పెర్ఫార్మన్స్.. that intensity in his eyes. ఎహే.. కేవలం నీ కళ్ళకే సింపుల్ గా ఓ గుడి కట్టించేయొచ్చు సామీ. రక్తచరిత్ర టూ తర్వాత అంత వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్ సూర్య మళ్లీ చేయడం ఇప్పుడే చూసా.

ఓవరాల్ గా అక్కడక్కడా లైట్ గా టర్బులెన్స్ లు ఎదురైనట్టు అనిపించినా, సినిమా పూర్తిగా చూశాక మాత్రం జెట్ ల్యాగ్ ఫీలయితే అస్సలు కలగదు.


Murali Sarkar

Next Story
Share it