Top
Batukamma

ఎన్టీఆర్ సరసన సువర్ణ?

ఎన్టీఆర్ సరసన సువర్ణ?
X
Highlights

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే..

టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్ సరసన విదేశీ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.

కరోనా వలన వాయిదా పడిన సినిమా తాజాగా మళ్ళీ మొదలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారని.. అందులో ఒక పాత్రకు విదేశీ భామను ఫైనల్ చేసిన జక్కన్న, మరో పాత్ర కోసం ఐశ్వర్య రాజేష్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇందులో ఐశ్వర్య రాజేష్‌ ఓ గిరిజన యువతిగా కనిపించనుందట.. ఆమె ఎన్టీఆర్ ప్రేయసిగానే సినిమాలో కనిపిస్తుందట.. ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం సర్కిల్ లో జోరుగా ప్రచారం సాగుతుంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.. ఇప్పటికే టాలెంటెడ్ యాక్టర్ గా ఐశ్వర్య రాజేష్‌ కి మంచి పేరు ఉంది. దానికి తోడు ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ అంటే ఇంకా క్రేజ్ రావడం ఖాయమే..

ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటించనున్నాడు. దసరాకి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అటు రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. దాదాపుగా 400కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది సినిమాని రిలీజ్ చేయనున్నారు. సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it