సిగరెట్ కాల్చిన కాజల్.. షాక్ లో ఫ్యాన్స్!

పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీలో ఉంది కాజల్.. ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో, శంకర్, కమల్ హసన్ కాంబినేషన్ లో భారతీయుడు 2 చిత్రాలలో నటిస్తోంది.
పెళ్లి తర్వాత కూడా కెరీర్ పరంగా ఫుల్ బిజీలో ఉంది కాజల్.. ప్రస్తుతం చిరంజీవి సరసన ఆచార్య సినిమాలో, శంకర్, కమల్ హసన్ కాంబినేషన్ లో భారతీయుడు 2 చిత్రాలలో నటిస్తోంది. చేతిలో బోలెడు సినిమాలు ఉండగానే వెబ్ సిరీస్ లను సైతం చేస్తోంది కాజల్..
'లైవ్ టెలికాస్ట్' పేరుతో ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో కాజల్ నటిస్తోంది. దీనికి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో కాజల్ ది ఓ జర్నలిస్ట్ పాత్ర.. ఫిబ్రవరి 12న (శుక్రవారం) లైవ్ టెలికాస్ట్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీలో స్ట్రీమింగ్ అయ్యింది.
ఇందులో కాజల్ నటన చాలా బాగుందని ప్రశంసలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా కాజల్ చేతిలో సిగరెట్ పట్టుకున్న ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాజల్ ఏంటి.. సిగరెట్ ఏంటి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
కాజల్ ధుమపానం చేసినప్పటికీ అది వెబ్ సిరీస్‌లో భాగంగానే చేసింది. సిరీస్‌లో కొన్ని మాస్ సీన్స్‌లో కాజల్ సిగరెట్ కాల్చే సందర్భాలు ఉన్నాయి. అందుకే అకా కనిపించింది. అయితే కొందరు అభిమానులు మాత్రం కాజల్ ధూమపానం చేయడం జీర్ణించుకోలేకపోతున్నారు.