Top
Batukamma

ఈ నటి భర్త ఓ స్టార్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలుసా?

ఈ నటి భర్త ఓ స్టార్ డైరెక్టర్ అన్న విషయం మీకు తెలుసా?
X
Highlights

సీనియర్ నటుడు విజయకుమార్ అందరికి సుపరిచితుడే.. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించారు.. టీవీ సీరియల్స్ లో కూడా నటించారు..

సీనియర్ నటుడు విజయకుమార్ అందరికి సుపరిచితుడే.. ఈయన తమిళ నటుడు అయినప్పటికీ తెలుగు, హిందీ, మలయాళం సినిమాల్లో కూడా నటించారు.. టీవీ సీరియల్స్ లో కూడా నటించారు.. ఆయన భార్య మంజుల కూడా నటి కావడం విశేషం..

ఈయన మొదటి భార్య ముత్తులక్ష్మి, రెండవ భార్య మంజుల. ఈయనకి మొత్తం ఆరుగురు పిల్లలు కాగా మొదటి భార్య ద్వారా ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు.. రెండవ భార్య ద్వారా ముగ్గురు కూతుర్లు ఉన్నారు.

ఆయన ఏకైక కొడుకు అరుణ్ విజయ్ నటుడిగా స్థిరపడ్డాడు.. ఇక ముగ్గురు కూతుర్లు వనిత, ప్రీత, శ్రీదేవి విజయకుమార్ కొన్ని సినిమాలలో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇందులో ప్రీత విజయకుమార్.. విజయకుమార్, మంజుల దంపతులకు రెండవ బిడ్డగా జన్మించింది.

ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ చిత్రాలలో నటించారు. తెలుగులో రుక్మిణి సినిమాతో ఆమె ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత వైఫ్, మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు మొదలగు సినిమాలలో నటించింది.

సినిమాలో అవకాశాలు తగ్గుముఖం పడుతున్న క్రమంలో తమిళ స్టార్ డైరెక్టర్ హరిని 2002 లో వివాహం చేసుకున్నారు. వీరికి మొత్తం ముగ్గురు పిల్లలున్నారు. కాగా దర్శకుడు హరి నటుడు సూర్యతో ఆరు, సింగం సీక్వెన్స్ సినిమాలను చేశారు.



Next Story
Share it