Top
Batukamma

రోజా లవ్ స్టోరీ.. చాలా ఇంట్రెస్టింగ్..!

రోజా లవ్ స్టోరీ.. చాలా ఇంట్రెస్టింగ్..!
X
Highlights

కానీ వీరి ప్రేమ వ్యవహారం ఎలా కొనసాగింది. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు.

Actress Roja Selvamani : సినీ నటి, ఎమ్మెల్యే రోజా .. డైరెక్టర్ సెల్వమణిని ప్రేమ పెళ్లి చేసుకున్నారనే విషయం చాలా మందికి తెలుసు. కానీ వీరి ప్రేమ వ్యవహారం ఎలా కొనసాగింది. ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియవు.

చాలామంది ప్రేమ పెళ్లిళ్లలా వీరి పెళ్లి విషయంలో చేజింగ్ లు.. భారీ భారీ డైలాగుల వంటివేం లేవట. చాలా సింపుల్ గా పెళ్లి జరిగిపోయిందని స్వయంగా రోజానే చెప్పారు.

సెల్వమణి చాలా సైలెంట్ గా.. రాముడు మంచి బాలుడు టైప్ లో కనిపిస్తారు. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఆయన మంచి తనానికి కేరాఫ్ అంట.

అందుకే రోజాని ప్రేమించినా.. ఆ విషయం నేరుగా ఆమెకు చెప్పకుండా దాచిపెట్టారట. నేరుగా వెళ్లి రోజా కుటుంబసభ్యులకు విషయం చెప్పి.. వారిని ఒప్పించి.. ఆ తర్వాత సీతారత్నంగారి అబ్బాయి సినిమా షూటింగ్ లో.. రోజా దగ్గరకు వచ్చి .. ఐ లవ్ యూ.. మన పెళ్లికి మీ ఇంట్లో ఒప్పుకున్నారని చెప్పారట.

జబర్ధస్త్ లో రోజా లవ్ స్టోరీ మీద సత్తిపండు, ఆనంద్ ఓ స్కిట్ చేశారు. ఈ సందర్భంగా తన ప్రేమ విషయాన్ని వెల్లడించింది రోజా.


Next Story
Share it