"క్వశ్చన్ మార్క్" అందాలతో కైపెక్కిస్తున్న అదాశర్మ

అందచందాలతో కనువిందు చేస్తానంటోంది. క్వశ్చన్ మార్క్ పేరుతో టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది అదాశర్మ.
Adah sharma: తెలుగు ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది అదా శర్మ. తన అందచందాలతో కనువిందు చేస్తానంటోంది. క్వశ్చన్ మార్క్ పేరుతో కొత్త మూవీతో మరోసారి టాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది అదా శర్మ.
ఈ సినిమాకు విప్రా దర్శకత్వం వహిస్తుండగా.. గౌరీకృష్ణ నిర్మాతగా ఉన్నారు. రఘుకుంచె మ్యూజిక్ అందించగా.. శేఖర్ మాస్టర్ కొరియాగ్రఫీ అందించారు.
ఈ మూవీ 'హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ గా ఉండబోతోందని అదాశర్మ(Adah sharma) చెప్పింది. ఇది ఖచ్చితంగా అందరికి నచ్చుతుందని ఈ భామ చెబుతోంది. తన జీవితంలో ఎదురైన ప్రశ్నల్ని అన్వేషిస్తూ యువతి సాగించే ప్రయాణం ఏమిటన్నదే.. చిత్ర కథాంశమని అదాశర్మచెబుతోంది.
ఈ మూవీలోని 'రామసక్కనోడివిరో' అనే పాటను ఇటీవలే రిలీజ్ చేశారు. పాట క్రెడిట్ మొత్తం సంగీత దర్శకుడు రఘు కుంచెకే దక్కుతుందని.. శేఖర్ మాస్టర్ అద్బుమైన కొరియోగ్రఫీ అందించారని సినీ దర్శకులు చెప్పారు.
- కోటి రూపాయలతో పోలీసులకు దొరికిన రఘునందన్ రావు బామ్మర్ది
- హైదరాబాద్ లో అల్లర్లకు బీజేపీ కుట్ర చేసింది.. జాగ్రత్త : కేటీఆర్