Top
Batukamma

సుమంత్ రిజెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్... ఇవి కనుక చేసుంటే..!

సుమంత్ రిజెక్ట్ చేసిన టాప్ 10 మూవీస్... ఇవి కనుక చేసుంటే..!
X
Highlights

తినే మెతుకు మీదా మన పేరు రాసి పెట్టి ఉండాలని అంటారు. అదే ఇండస్ట్రీలో అయితే చేసే ప్రతి సినిమా పైన పలనా హీరో పేరు ఉండాలని అంటారు.

తినే మెతుకు మీదా మన పేరు రాసి పెట్టి ఉండాలని అంటారు. అదే ఇండస్ట్రీలో అయితే చేసే ప్రతి సినిమా పైన పలనా హీరో పేరు ఉండాలని అంటారు. అవును ఒక్కోసారి ఓ హీరో వదులుకున్న సినిమా మరో హీరో వద్దకి చేరి సూపర్ డూపర్ హిట్ అవ్వొచ్చు.

అక్కినేని కుటుంబం నుంచి మూడోతరం హీరోల్లో మొదటివాడైన సుమంత్ తన 20 ఏళ్ల కెరీర్ లో సత్యం, గోదావరి, గోల్కొండ హై స్కూల్, మళ్లీరావా మొదలగు హిట్ సినిమాలు చేసినప్పటికీ.. తనకంటే వెనుక వచ్చిన హీరోలను మాత్రం అందుకోకలేకపోయాడు.

అయితే హీరో సుమంత్ వదులుకున్న ఓ పది చిత్రాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..

1. నువ్వేకావాలి( తరుణ్ కి హీరోగా మొదటి సినిమా.. ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ చిత్రం)

2. తొలిప్రేమ ( చిరంజీవి తమ్ముడిగా కాకుండా పవన్ కి సొంతగా పేరు తెచ్చిపెట్టిన చిత్రం.. పవన్ కి ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్ )

3. ఇడియట్ ( పూరి మొదటగా సుమంత్ నే అనుకున్నాడట.. కానీ సుమంత్ రిజెక్ట్ చేయడంతో రవితేజకి వెళ్ళింది.. రవితేజని స్టార్ చేసిన సినిమా ఇదే)

4.నువ్వొస్తావని ( సుమంత్ రిజెక్ట్ చేయడంతో నాగార్జున చేశారు.. నాగ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీలో ఇది ఒకటి)

5. మనసంతా నువ్వే ( సుమంత్ రిజెక్ట్ చేయడంతో దర్శకుడు తేజ సజేషన్ తో ఉదయ్ కిరణ్ కి వెళ్ళింది... ఉదయ్ కిరణ్ కి హైట్రిక్ ఫిల్మ్ ఇదే )

6.ఆనందం (శ్రీను వైట్లకి మంచి బ్రేక్ ఇచ్చిన మూవీ ఇదే .. ఇప్పటికీ ఈ సినిమాకి హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ సినిమాని కూడా సుమంత్ రిజెక్ట్ చేశాడట)

7. దేశముదురు ( ఈ సినిమా కథ నచ్చిన సుమంత్ చేయలేదట.. కారణం తాను ఈ కథకి సూట్ అవ్వనని ..బన్నీ చేశాడు కాబట్టే సినిమా హిట్ అయిందని ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు సుమంత్)

8. గమ్యం (ముందుగా శర్వానంద్ పాత్రకి సుమంత్ నే అనుకున్నాడట క్రిష్.. కానీ సుమంత్ రిజెక్ట్ చేశాడట)

9. అష్టా చమ్మా( ముందుగా నాని పాత్రకి సుమంత్ నే అనుకుంటున్నారట ఇంద్రగంటి.. కానీ సుమంత్ రిజెక్ట్ చేయడంతో నాని హీరో అయ్యాడు..)

10. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్( రవితేజ కంటే ముందు సుమంత్ వద్దకి ఈ సినిమా వెళ్లిందట.. ఈ సినిమా కమర్షియల్ గా ప్లాప్ అయిన ఈ సినిమాకి హార్డ్ కొర్ ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పటికీ)..

ఇన్ని బ్లాక్ బస్టర్ సినిమాలను సుమంత్ ఒకవేళ చేసుంటే అతడి కెరీర్ మరోలా ఉండేదని సినీ విశ్లేషకుల అభిప్రాయం..

ఈ సినిమాలను వదులున్న సుమంత్ ... ఆ తర్వాత అదే దర్శకులతో వేరే సినిమాలు చేశాడు కానీ ఆ సినిమాలు సుమంత్ కి అంత ప్లస్ కాలేదు..

Next Story
Share it