Allari Naresh Naandhi Review : నరేష్ కుమ్మేశాడు భయ్యా .. నాంది రివ్యూ!

ఇక చాలా రోజుల తర్వాత నరేష్ లోని అసలైన నటుడిని ఈ సినిమాలో చూస్తారు.. పక్కాగా చెప్పాలంటే నరేష్ కి ఇది కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి.
Allari Naresh Naandhi Review : కామెడీతో కితకితలు పెట్టిస్తునే... సీరియస్ పాత్రలతో మెప్పించగల నటుడు అల్లరి నరేష్.. ప్రాణం, గమ్యం లాంటి సినిమాలతో తనలోని నటుడిని బయటపెట్టిన నరేష్... ఇప్పుడు నాంది అనే ఓ వినూత్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రిలీజ్ కు ముందే విడుదలైన పోస్టర్స్, ట్రైలర్, టీజర్ సినిమా పైన భారీ అంచనాలు పెంచేశాయి. ఇప్పుడు ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో చూద్దాం..
ఈ సినిమా స్టోరీ గురించి ఒక లైన్లో చెప్పాలంటే చేయని మర్డర్ కోసం జైల్లో ఇరుకున్న హీరో .. ఓ లాయర్ సహాయంతో ఎలా బయటపడ్డాడు అనేది ఈ సినిమా.. సినిమా ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఫస్టాఫ్ కొంచెం బోర్ కొట్టినా .. సెకండ్ మాత్రం ప్రేక్షకుల్ని సీట్లో నుంచి కదలనివ్వకుండా కూడా చేస్తుంది. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో కథ సాగుతుంది..
ఇక చాలా రోజుల తర్వాత నరేష్ లోని అసలైన నటుడిని ఈ సినిమాలో చూస్తారు.. పక్కాగా చెప్పాలంటే నరేష్ కి ఇది కం బ్యాక్ మూవీ అనే చెప్పాలి. నరేష్ నటన సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది. ముఖ్యంగా జైల్లో నరేష్ నటనను చూస్తే మెచ్చుకోకుండా ఉండలేం.. ఇక హీరోయిన్ పాత్రకి అంతగా స్కోప్ లేదు. లాయర్ పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ అదరగొట్టింది.
డైరెక్టర్ విజయ్ కనకమెడల ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో కథను నడిపించిన విధానం సింప్లీ సూపర్.. మొదటి సినిమానే అయిన అనుభవం ఉన్న దర్శకుడి ఆయనలో కనిపించాడు. సీరియస్ కథకి అనవసరంగా కామెడీ జోడించి బోర్ కొట్టించలేదు. థ్రిల్లర్ కాన్సెప్ట్స్ ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా బాగా నచ్చుతుంది.
ఈ సినిమాకి బతుకమ్మ ఇచ్చే రేటింగ్ 3/5