Top
Batukamma

వామ్మో రంగమ్మత్త.. పక్కా లోకల్ అంటూ.. రచ్చ రచ్చ..!

Anasuya Bharadwaj dance in zee telugu dussehra event
X
Highlights

యాంకర్ అనసూయ పక్కా లోకల్ అంటూ ఓ ఐటెం సాంగ్ చేసి... అందరిని మైండ్ బ్లాక్ చేసేసింది.

ప్రతీ పండక్కి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఛానల్స్ ముందు నుంచే ప్లాన్స్ చేస్తుంటాయి. అందులో భాగంగానే దసరా సందర్భంగా జీ తెలుగు ఛానల్ యాంకర్స్ ప్రదీప్, శ్రీముఖి పెళ్ళంటూ ఓ స్పెషల్ షో ని ప్లాన్ చేసింది. ఈ స్పెషల్ షోకి నాగబాబు, నిహారిక చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు.. ఈ షోకి సంబంధించిన ప్రోమోని ఈరోజు యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.

ఇందులో ఎప్పటిలాగే కొన్ని కామెడీ స్కిట్స్ తో షో ఫన్నీగా సాగింది. అయితే ఈ ప్రోమోలో యాంకర్ అనసూయ (Anasuya Bharadwaj) పక్కా లోకల్ అంటూ ఓ ఐటెం సాంగ్ చేసి... అందరిని మైండ్ బ్లాక్ చేసేసింది. నడుము తిప్పుతూ, అందాలు ఆరబోస్తూ.. ఊర మాస్ స్టెప్స్ వేసి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించింది.

35ఏళ్ల వయసులో అందంతోనే కాదు.. తన డాన్స్ తో కూడా మతి పోగొట్టింది ఈ రంగమ్మత్త.. ప్రస్తుతం ఈ ప్రోమోకి యూట్యూబ్ లో మంచి రేస్పాస్ వస్తోంది.

సాధారణంగానే అనసూయ ఫొటోలు, ప్రోగ్రామ్స్ పై సోషల్ మీడియాలో ఫుల్ ట్రోలింగ్ చేస్తుంటారు. మొన్నీమధ్యే అలీతో కలిసి చేసిన ప్రోగ్రాంలో అనసూయ వేసుకున్న డ్రెస్ పై సోషల్ మీడియాలో దుమ్ము దులిపి వదిలేశారు. ప్రోగ్రాం వీడియో కింద కామెంట్స్ లో బూతులకైతే లెక్కేలేదు.




అయితే.. ఎవరు ఏమనుకుంటే నాకేంటీ.. అంటూ దూసుకెళ్తోంది అనసూయ. నేను నాకునచ్చినట్టు ఉంటా.. మీకెంటి నొప్పి అంటూ.. స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది. అందుకు తగ్గట్టుగానే తన సోషల్ మీడియా అకౌంట్లలో ఫొటోలు పెడుతోంది. యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రాముల్లోనూ ఫుల్ గా డోస్ పెంచేస్తోంది. హీరోయిన్లకు తాను ఏ మాత్రం తీసిపోనంటూ.. సవాల్ విసురుతోంది ఈ 35 ఇయర్స్ బ్యూటీ.




ఈ హాట్ బ్యూటీపై (Anasuya Bharadwaj) ట్రోలింగ్ ఏ స్థాయిలో జరుగుతోందో తెలుసుకోవడానికి మరో ఎగ్జాంపుల్ ఏంటంటే.. ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేసిన జీ తెలుగు.. కింద కామెంట్స్ సెక్షన్ ను మాత్రం ఆఫ్ చేసి పెట్టింది. ప్రోగ్రామ్ లో రంగమ్మత్త డ్యాన్స్ చూసి ట్రోలర్స్ పిచ్చిక్కి ఏమేం కామెంట్లు పెడతారోనని ముందే భయపడినట్టుంది జీ తెలుసు మేనేజ్ మెంట్.















Next Story
Share it