Top
Batukamma

చెప్పేది శ్రీరంగ నీతులు.. వేసుకునేవి సగం బట్టలు!

చెప్పేది శ్రీరంగ నీతులు.. వేసుకునేవి సగం బట్టలు!
X
Highlights

వాస్తవానికి వర్ష చేసిన ఈ వీడియో కూడా రెండు సంవత్సరాలు క్రితం వీడియోనే. మరి ఇప్పుడెందుకు వైరల్ అవుతుందంటే.. సీరియల్స్ తో బుల్లితెర పైకి వచ్చిన వర్షకి అంతగా పెద్ద క్రేజ్ రాలేదు..

ఆ మధ్య జబర్దస్త్ యాంకర్ అనసూయ దగ్గరికి ఓ బాలుడు సెల్ఫీ తీసుకునేందుకు వస్తే అతడి నుంచి బలవంతంగా సెల్ ఫోన్ తీసుకొని అనసూయ ఫోన్ పగలకొట్టిన ఇష్యూ పెద్ద వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.. దీనిపైన ఆ బాలుడు తల్లి ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కూడా.

ఇష్టం ఉంటే సెల్ఫీ ఇవ్వాలి లేకపోతే లేదు కానీ ఇలా ఫోన్ పగలగొట్టటం ఏంటి అని ఆ బాలుడు తల్లితో పాటుగా నెటిజన్లు గరంగరం అయ్యారు.. అంతేకాకుండా అనసూయని దారుణంగా ట్రోల్ చేశారు. అయితే దీనిపైన అనసూయ స్పందిస్తూ.. ఆ సమయంలో తాను సెల్ఫీ ఇచ్చే పరిస్థితుల్లో లేనని, అయినప్పటికీ ఆ బాలుడు తనని చాలా విసిగించడాని ఆ క్రమంలో దురదృష్టవశాత్తు ఫోన్ పగిలినట్టుగా అనసూయ తన వర్షెన్ చెప్పుకొచ్చింది.


రెండు సంవత్సరాలు కింద అయిపోయిన ఈ మ్యాటర్ పైన జబర్దస్త్ ఆర్టిస్ట్ వర్ష స్పందించింది.. అనసూయ ప్లేస్ లో ఓ స్టార్ హీరో ఉండి, ఆ బాలుడి ప్లేస్ లో అనసూయ పిల్లలు ఉంటే అలా ఆ స్టార్ హీరో ఆ ఫోన్ పగలగొడితే అనసూయకు బాధ అనిపించదా అని ప్రశ్నించింది.. ఆ క్షణంలో ఆ బాలుడు, బాలుడి తల్లి ఎంత బాధపడిందో అనసూయకు తెలుసా అంటూ క్వశ్చన్ చేసింది.

పనిలో పనిగా అనసూయను కూడా గట్టిగానే కౌంటర్ వేసింది. ప్రేక్షకులకు నచ్చితేనే ఈ రోజు యాంకర్ గా కొనసాగుతున్నావ్ అంటూ మాట్లాడింది. పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకో అంటూ క్లాస్ పీకింది. అంతేకాకుండా డ్రెస్ ల విషయంలో అభిమానులు పెట్టె కామెంట్స్ కు.. రాష్ గా కాకుండా నీట్ గా రిప్లై ఇవ్వండి.. చెప్పేది మీ ఫ్యాన్స్ అంటూ చెప్పుకొచ్చింది వర్ష..


వాస్తవానికి వర్ష చేసిన ఈ వీడియో కూడా రెండు సంవత్సరాలు క్రితం వీడియోనే. మరి ఇప్పుడెందుకు వైరల్ అవుతుందంటే.. సీరియల్స్ తో బుల్లితెర పైకి వచ్చిన వర్షకి అంతగా పెద్ద క్రేజ్ రాలేదు.. కానీ ఈ మధ్య జబర్దస్త్ లోకి వచ్చి ఓ రెండు స్కిట్లు చేసి బాగా పాపులర్ అయింది.. దీనితో ఇప్పుడు ఈ పిల్ల ఏం చేసినా ట్రెండ్ అవుతున్నాయి.

పనిలో పనిగా పాత పడ్డ ఆ వీడియోని ఓ యూట్యూబ్ ఛానల్ ఫ్రెష్ గా అప్లోడ్ చేయడంతో ఇప్పుడు వైరల్ అవుతోంది.. అయితే నెటిజన్లు మాత్రం వర్షనే ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే డ్రెస్ ల విషయంలో అనసూయని క్లాస్ పీకిన వర్ష .. అనసూయ కంటే దారుణంగా ఎక్స్ పోస్ చేస్తోంది. ఆమె ఫోటోలు చూస్తుంటే తెలుగమ్మాయేనా అని అనిపిస్తోంది. ఈ ఫోటోలోను సోషల్ మీడియాలో పెడుతూ అనసూయ ఫ్యాన్స్ ఆమె పై ట్రోల్ చేస్తున్నారు.


నిజానికీ అనసూయ, వర్ష ఇద్దరు గ్లామర్ ఫీల్డ్ లొనే ఉన్నారు. ఇద్దరికి గ్లామర్ ఉంది. కానీ డ్రెస్ ల విషయంలో ఒకరిపైన ఒకరు కామెంట్స్ చేసుకోవడం అనేది విడ్డూరంగా ఉంది.

- Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి!

- ఆ సినిమా క్లైమాక్స్ చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్య.. క్షమాపణలు కోరిన డైరెక్టర్
Next Story
Share it