ప్రెగ్నెంట్ అయిన యాంకర్ అనసూయ!

ఈ ఫస్ట్ లుక్ లో లిఫ్ట్‌లో అనసూయ భరద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్‌లో కనిపిస్తుంది. చేతిలో ఫేస్ మాస్క్ పట్టుకొని అనసూయ చాలా కోపంగా వెనక్కి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది.
జబర్దస్త్ యాంకర్ అనసూయ గర్భం దాల్చారు ఎం అయితే అది నిజంగా కాదండోయ్.! సినిమాలోనే.. అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కుతున్న చిత్రం థ్యాంక్ యు బ్రదర్. ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని దగ్గుబాటి రానా రిలీజ్ చేయగా, తాజాగా ఫస్ట్ లుక్ ని మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రిలీజ్ చేశారు.
ఈ ఫస్ట్ లుక్ లో లిఫ్ట్‌లో అనసూయ భరద్వాజ్ ప్రెగ్నెంట్ లుక్‌లో కనిపిస్తుంది. చేతిలో ఫేస్ మాస్క్ పట్టుకొని అనసూయ చాలా కోపంగా వెనక్కి చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇక ఆమె వెనక అశ్విన్ విరాజ్ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నాడు. ఇలా ఒకరి వెనుక ఒకరు నిల్చొని వెనక్కి తిరిగి చూసుకోవడం ఆసక్తికరంగా మారింది.
రమేష్ రాపర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, గుణ బాలసుబ్రమణియన్ సంగీతం అందిస్తున్నారు.