Top
Batukamma

సిల్క్ స్మితగా అనసూయ.. పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్!

సిల్క్ స్మితగా అనసూయ.. పర్ఫెక్ట్ అంటున్న ఫ్యాన్స్!
X
Highlights

మీడియా యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన అనసూయ ఇప్పుడు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. కొంటెచూపులతో, మత్తెకించే అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఈ హాట్ యాంకర్ సోంతం.

మీడియా యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన అనసూయ ఇప్పుడు బుల్లితెర పై టాప్ యాంకర్ గా కొనసాగుతుంది. కొంటెచూపులతో, మత్తెకించే అందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడం ఈ హాట్ యాంకర్ సోంతం. అయితే ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ తో ఆకట్టుకుంటూ వచ్చిన ఈ రంగమ్మత్త ఇప్పుడు ఓ బోల్డ్ అటెంప్ట్ కి సిద్దమైంది.

తమిళ్, తెలుగు చిత్రాలలో శృంగారతారగా ఓ వెలుగు వెలిగిన సిల్క్ స్మిత పాత్రలో అనసూయ నటిస్తోంది. ఇప్పటికే లుక్ టెస్ట్ చేయగా అనసూయ సూపర్ గా సెట్ అయింది. దీనికి సంబంధించిన పిక్ ని తాజాగా అనసూయ సోషల్ మీడియాలో షేర్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క ఫోటోతోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన అనసూయ సినిమాలో నటించి ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి మరి!

తమిళ్ ఇండస్ట్రీకి అనసూయ ఈ సినిమాతోనే పరిచయం అవుతుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించడంలో సిల్క్ స్మిత ఆమెకి ఆమె సాటి.. మరి ఆ పాత్రలో అనసూయ అంటే ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. చూడాలి మరి.. అంతకుముందు సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా బాలీవుడ్లో డర్టీ పిక్చర్ సినిమా రాగా విద్యా బాలన్ కీ రోల్ ప్లే చేసింది.

Next Story
Share it