Top
Batukamma

Tv9 యాంకర్ దీప్తి నల్లమోతు.. ఈమె అస్సలు ముసల్ది అవ్వకూడదే..!

Tv9 యాంకర్ దీప్తి నల్లమోతు.. ఈమె అస్సలు ముసల్ది అవ్వకూడదే..!
X
Highlights

ఇప్పటికీ సినిమా తాలూకు సన్నివేశాలను, పాటలను ఇమిటేట్ చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు..

టిక్ టాక్ యాప్ వచ్చిన తరువాత చాలా మంది దానికి ఆడిక్ట్ అయిపోయారు. సినిమాలోని సాంగ్స్, లేదా సీన్స్ ను అచ్చుగుద్దినట్టుగా దింపుతూ తెగ పాపులారిటీని సంపాదించుకున్నారు. ఏకంగా కొందరైతే సెలబ్రిటీలు అయిపోయారు..ప్రస్తుతానికి ఆ యాప్ బ్యాన్ అయింది కానీ... ఆ మూడ్ నుంచి మాత్రం ఇంకా చాలా మంది బయటకు రాలేదు..

ఇప్పటికీ సినిమా తాలూకు సన్నివేశాలను, పాటలను ఇమిటేట్ చేస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.. అందులో భాగంగానే టీవీ 9 యాంకర్ నల్లమోతు దీప్తి.

తాజాగా ఉప్పెన సినిమాలోని 'ధక్ ధక్ ధక్' పాటను ఇమిటేట్ చేస్తూ ఓ వీడియోని పోస్ట్ చేసింది. కృతిశెట్టిని ఇమిటేట్ చేసేందుకు బాగానే ట్రే చేసింది.. మ్యాచింగ్ డ్రెస్ తో వీడియోకి మంచి కలరింగ్ తెచ్చింది.

ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. నెటిజన్లు కూడా తమదైన కామెంట్స్ తో దీప్తిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకొందరైతే ఈమె అస్సలు ముసల్ది అవ్వకూడదే అంటూ సినిమాలోని పాపులర్ డైలాగ్ ను వాడేస్తూ పొగిడేస్తున్నారు.

కాగా.. డిఫరెంట్ మేనరిజమ్‌తో రిపోర్టింగ్ చేసే టీవీ 9 యాంకర్ దీప్తి నల్లమోతు.. బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ ఫుల్ క్రేజ్ దక్కించుకుంది. తాజాగా సదరు ఛానల్‌ నుంచి బయటకు వచ్చేసి కొత్తగా ఓ యూట్యూబ్‌ ఛానల్‌ని స్టార్ట్ చేసింది.


Next Story
Share it