Top
Batukamma

యాంకర్ రవి ప్రేమ, పెళ్లి.. ఓ ఆసక్తికరమైన మోసం!

యాంకర్ రవి ప్రేమ, పెళ్లి.. ఓ ఆసక్తికరమైన మోసం!
X
Highlights

ప్రేమ కథలు ఎక్కువగా పుట్టేది కాలేజీలోనే.. మోస్ట్ గా చాలా మందికి లవ్ స్టోరీస్ ఇక్కడే ఉంటాయి. అలాగే కాలేజీలోనే తనకి ప్రేమ పుట్టింది అంటున్నాడు యాంకర్ రవి..

ప్రేమ కథలు ఎక్కువగా పుట్టేది కాలేజీలోనే.. మోస్ట్ గా చాలా మందికి లవ్ స్టోరీస్ ఇక్కడే ఉంటాయి. అలాగే కాలేజీలోనే తనకి ప్రేమ పుట్టింది అంటున్నాడు యాంకర్ రవి.. నిత్య సక్సేనాతో యాంకర్ రవి 16 ఏళ్ల ప్రేమ, పెళ్లి వెనుక ఓ ఆసక్తికరమైన మోసం కూడా ఉందట..

తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన రవి.. నా ప్రేమ చాలా గమ్మత్తుగా ఉంటుంది. బీటెక్ సెకండ్ ఇయర్‌లో ఉండగా, నిత్యను నా బెస్ట్ ఫ్రెండ్ ఒకడు ట్రై చేసేవాడు. వాడు నా దగ్గరికి వచ్చి... నిత్యను లవ్ చేసేందుకు హెల్ప్ చేయమని హెల్ప్ చేయరా అని అడిగేవాడు.. నేను చూసుకుంటా నీకెందుకురా అని నేను హెల్ప్ చేసేవాడిని.


ఈ ప్రాసెస్ లో నిత్య గురించి తెలుసుకున్నా.. నిత్య గురించి తెలియగానే చాలా స్వీట్ అండ్ క్యూట్ అనిపించింది. ఇలాంటి అమ్మాయిని వాడికెందుకు వదలాలి అనుకున్నా... ఆ తర్వాత మెల్లిగా వాడిని సైడ్ చేసి.. నిత్యని నేను లైన్లో పెట్టా.. ఆ అమ్మాయి నీకు సెట్ కాదని తప్పుకో అని చెప్పా..అప్పట్లో నా దగ్గర వొడాఫోన్ టు వొడాఫోన్ ఫ్రీ ఉండేది.


ఇద్దరం రాత్రి 11 గంటల వరకు మాట్లాడుకునే వాళ్ళం... మళ్ళీ ఉదయాన్నే లేచి కాలేజ్‌కి వెళ్లి అక్కడ కూడా మాట్లాడుకునేవాళ్లం.. ఇద్దరిలో ప్రేమ ఉంది కానీ అది ఇంకా బయటకు చెప్పుకునే వాళ్ళం కాదు. ఒకరికొకరు అడిక్ట్ అయిపోయాం. ఎలాంటి ప్రాబ్లం వచ్చిన ఒకరికొకరు మాట్లాడుకుని సొల్యుషన్ వెతుక్కునే వాళ్లం

ఇక బీటెక్ అయిపోయాక నిత్య లేకపోతే తన లైఫ్ ఎలా ఉంటుందో తనకి అర్ధం అయింది.. ఆమెను దూరం చేసుకోవద్దని ఫిక్స్ అయిపోయి.. వెంటనే ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేశా.. దానికి నిత్య కూడా ఒకే చెప్పేసింది. అలా ప్రేమ నుంచి పెళ్లిదాకా వెళ్ళింది. ఇక ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుందని అన్నట్టుగా నా సక్సెస్ వెనుక నిత్య ఉంటుందంటున్నాడు యాంకర్ రవి.

Next Story
Share it