Top
Batukamma

హమ్మ శ్యామలా..? ఈ టాలెంట్ కూడా ఉందా..? వీడియో వైరల్..!

హమ్మ శ్యామలా..? ఈ టాలెంట్ కూడా ఉందా..? వీడియో వైరల్..!
X
Highlights

తన టాలెంట్ చూపించింది. వన్నె తగ్గని అందంతో ఫ్యాన్స్ గుండెల్లో గంటలు మోగిస్తుంది ఈ బ్యూటీ.

యాంకర్ శ్యామల గురించి తెలియని వారు చాలా తక్కువమందే ఉంటారు. ఆ స్థాయిలో ప్రేక్షకులను సంపాదించుకుంది ఈ నిషా కళ్ల సుందరి.

యాంకర్ గా కెరీర్ ప్రారంభించి సినిమాల్లోనూ నటించింది. తన టాలెంట్ చూపించింది. వన్నె తగ్గని అందంతో ఫ్యాన్స్ గుండెల్లో గంటలు మోగిస్తుంది ఈ బ్యూటీ.

రెగ్యులర్ గా సోషల్ మీడియాలో అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఫొటోలు, వీడియోలతో ఫ్యాన్స్ ని ఎంటర్ టైన్ చేస్తుంది.

అయితే.. ఇప్పుడు మరో విధంగా ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది ఈ బ్యూటీ.

గ్లామర్, యాక్టింగ్ కాదు.. తనలో మరో టాలెంట్ కూడా ఉందని చూపించుకుంటోంది.

ఇటీవల సోషల్ మీడియాలో ఓ పాట చాలా వైరల్ అయ్యింది. విరాట పర్వం సినిమాలోని సారంగదరియా ఏ స్థాయిలో దూసుకెళ్తోందో అందరికి తెలిసిందే. ఎక్కడ చూసినా ఇదే పాట.. ఊపు ఊపేస్తోంది.

ఈ పాటకి ఇటీవలే ఓ స్పూఫ్ తయారయ్యింది. కరోనా వైరస్ పై జాగ్రత్తలు, వ్యాక్సిన్ పై అవగాహన కల్పిస్తూ ఓ రచయిత పాట రాశాడు. సారంగదరియా ట్యూన్ లో నే ఆ పాట రాశాడు.

ఆ పాటతో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది శ్యామల. పాట పాడుతూ.. పాటకు తగ్గట్టు స్టెప్పులేస్తూ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ వీడియో పోస్ట్ చేసింది.


- Allu arjuns Pushpa Teaser :పుష్ప టీజర్

- తెలుగు సినిమోళ్లు జంగల్ వట్టిన్రు..!

- రష్మీ నుంచి సుడిగాలి సుధీర్ వరకు జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఇవే.. !

- ప్రగతి ఆంటీ వర్కౌట్ చూస్తే ఫిదా కావాల్సిందే..!

Next Story
Share it