Top
Batukamma

బండి నడవాలంటే ఇవన్నీ తప్పదు.. పాపం స్టార్ మా..!

బండి నడవాలంటే ఇవన్నీ తప్పదు.. పాపం స్టార్ మా..!
X
Highlights

హౌస్ లో జోష్ కనిపించడం లేదు. అదే డల్ నెస్.. ఒకట్రెండు లవ్ ఎఫైర్లు.. అంతకు మించి అక్కడేం లేదనే ఫీలింగ్ జనంలో వచ్చింది

Anchor suma : బిగ్ బాస్ తెలుగు సీజన్ 4.. కరోనా విపత్తు సమయంలో.. లాక్ డౌన్ నిబంధనల మధ్యే మొదలైంది. కరోనా ఎఫెక్ట్ తో కాస్త కుదించారు. మిగతాదంతా సేమ్ టూ సేమ్.

అయితే.. బిగ్ బాస్ తెలుగు గత మూడు సీజన్లు కాస్త ఎంటర్ టైనింగ్ గా నడిచాయి. హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు తెలిసిన వాళ్లే కావడంతో.. అందులోనూ కాస్త స్టార్ డం ఉన్నవాళ్లు కావడంతో జనం ఎగబడి మరీ చూశారు. దీంతో తెలుగు ఎంటర్ లైన్ మెంట్ మీడియాలో స్టార్ మా మంచి రేటింగ్ ను రాబట్టింది.

ఇప్పుడు లాక్ డౌన్ టైంలో ప్రేక్షకులకు గత సీజన్ ల కంటే ఎక్కువ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామంటూ షో మొదలుపెట్టింది స్టార్ మా. ఇద్దరు ముగ్గురు తప్ప.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లో బయటి జనానికి పెద్దగా తెలిసిన వాళ్లు లేరు.

మరీ ముఖ్యంగా గత సీజన్లలో బిగ్ బాస్ కు రూరల్ ఆడియన్స్ కూడా చాలా వరకు కనెక్ట్ అయ్యారు. కానీ ఈ సారి అది లోపించింది. కారణం కంటెస్టెంట్లు అంతా కొత్తవారే కావడం. అయితే.. ఈ సమస్యను అధిగమించడానికి ఓ ప్రయత్నం చేసింది.

వృద్దురాలు.. అసలు ఈ నూతన పోకడలు తెలియని గంగవ్వను తీసుకొచ్చి హౌస్ లో కూర్చోబెట్టింది స్టార్ మా. గంగవ్వ హౌజ్ లో ఉన్నన్న రోజులు వ్యవస్థ బాగానే నడిచింది. రూరల్ ఆడియన్స్.. గంగవ్వకు ఉన్న సిటీ ఆడియన్స్ బిగ్ బాస్ షో ని ఫాలో అయ్యారు.

గంగవ్వ బయటకు వెళ్లిపోయాక మళ్లీ సమస్య వచ్చి పడింది. కొద్దిరోజులు పోయాక సమంత రూపంలో మరో మెరుపు వచ్చింది. నాగార్జున షూటింగ్ బిజీలో ఉండటంతో... సమంతను హోస్ట్ గా పెట్టారు. తన అందంతో మాటకారి తనంతో ప్రేక్షకుల మనసు దోచుకుంది సమంత. హౌస్ కు వచ్చినన్ని రోజులు అందర్ని కట్టిపడేసింది.

సమంత ఎపిసోడ్ కూడా ముగిసిపోవడంతో మళ్లీ సేమ్ సమస్య. హౌస్ లో జోష్ కనిపించడం లేదు. అదే డల్ నెస్.. ఒకట్రెండు లవ్ ఎఫైర్లు.. అంతకు మించి అక్కడేం లేదనే ఫీలింగ్ జనంలో వచ్చింది. ఇది ఇలాగే కంటిన్యూ అయితే.. చాలా ప్రమాదం అని భావించినట్టుంది స్టార్ మా. ఇలాంటి సమస్య ముందే వస్తుందని ఊహించినట్టు కనిపిస్తోంది.

అందుకే యాక్టీవ్ నెస్ కి కేరాఫ్ అయిన యాంకర్ సుమను తీసుకొచ్చింది. తన మాటలతో సుమ ఆడియన్స్ ను ఎలా పట్టిపడేస్తుందో అందరికి తెలిసిందే. ఆమె ఓ మాటల సముద్రం.. పంచ్ ల ప్రవాహం. ఆమె పంచ్ లకు కౌంటర్ ఇవ్వాలంటే కష్టమే.

సో ఇలాంటి వ్యక్తి హౌస్ లో ఉంటే ఆ సందడే వేరు. అందుకే సుమను బిగ్ బాస్ కు పట్టుకొచ్చారనే మాట వినిపిస్తోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ సుమతో ఓ ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో నాగార్జునతో సహా ప్రతీ ఒక్కరిని చెడుగుడు ఆడేసుకుంది సుమ. ఇది ట్రైలర్ మాత్రమే హౌస్ లోకి వచ్చాక అసలు సినిమా చూపిస్తానంటూ కంటెస్టెంట్లకు సవాల్ విసిరింది.

అయితే.. సుమ(Anchor suma ) నిజంగానే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌస్ లోకి వెళ్తోందా..? లేకపోతే జస్ట్ ప్రోమో కోసం ఈ డ్రామా ఆడారా..? అనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఎందుకంటే సుమ ఎంత బిజీ యాంకరో అందరికి తెలిసిందే. రెండు మూడు టీవీ ఛానల్లలో షోలు. ఇతర ప్రోగ్రాంలతో ఎప్పుడూ ఆమె షెడ్యూల్ బిజీగా ఉంటుంది. ఆమె లేకపోతే ఆ షోల సంగతి అంతే.

మరి అలాంటి బిజీ షెడ్యూల్ వదిలేసి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సుమ ఉండగలదా..? ఒక వేళ అలా ఉండాల్సి వస్తే.. సుమ రెమ్యునరేషన్ ను బిగ్ బాస్ నిర్వాహకులు భరించగలరా..? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఒక్క షో కే లక్షల్లో తీసుకునే సుమ.. కొన్ని రోజుల పాటు హౌస్ లో ఉండాలంటే.. కోట్లలోనే చెల్లించాల్సి వస్తుంది.

అందుకే జస్ట్ సండే స్పెషల్ గా ప్రోమో వదిలారనే మరో ప్రచారం కూడా జరుగుతోంది. జస్ట్ సండే స్పెషల్ గా సుమ అలా వచ్చి వెళ్తుంది తప్ప.. అక్కడ ఉండే అవకాశమే లేదంటున్నారు. చూడాలి మరి సుమతో స్టార్ మా చేయించిన ఈ ప్రోమో డ్రామానా..? లేక నిజంగానే గేమా.? అనేది చూడాలి.

- జో బైడెన్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?

- కమలా హ్యారిస్ గురించి ఈ 10 ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా?

Next Story
Share it