Top
Batukamma

సినిమాల్లోకి అల్లు అర్జున్ బామ్మర్ది... బతుకు బస్టాండ్ అంట..!

సినిమాల్లోకి అల్లు అర్జున్ బామ్మర్ది... బతుకు బస్టాండ్ అంట..!
X
Highlights

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి అత్యధిక మంది హీరోలు ఉన్నారు. ముందుగా చిరంజీవి నట వారసుడిగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. కానీ అయన అంతగా సక్సెస్ కాలేకపోయారు.

ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి అత్యధిక మంది హీరోలు ఉన్నారు. ముందుగా చిరంజీవి నట వారసుడిగా నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆయన అంతగా సక్సెస్ కాలేకపోయారు. ఆ తరవాత వచ్చిన పవన్ కళ్యాణ్ ఏకంగా చిరంజీవినే మించిపోయారు.

ఇక ఆ తర్వాత అల్లు అర్జున్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, కళ్యాణ్ దేవ్ వంటి హీరోలు వచ్చి సత్తా చాటారు. తాజాగా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చి 100 కోట్లు కొల్లగొట్టాడు. అయితే ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

నిర్మాత అల్లు అరవింద్‌ బావమరిది కొడుకు విరాన్ ముత్తంశెట్టి..హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాకి బతుకు బస్టాండ్ అనే వెరైటీ టైటిల్ ను పెట్టేశారు కూడా.. జూన్ 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

నాగబాబు అల్లుడు, నిహారిక భర్త చైతన్య జొన్నలగడ్డ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడని తెలుస్తోంది. ఇప్పటికే నటనలతో డాన్సులో శిక్షణ తీసుకోబోతున్నట్టు సమాచారం. దీనిపైన త్వరలోనే ఆఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుంది.


Next Story
Share it