Top
Batukamma

అరియానా అందాల వెనుక విషాదం..!

అరియానా అందాల వెనుక విషాదం..!
X
Highlights

800, రూ. 500 కోసం కూడా ఈవెంట్స్ చేశాను. ఒక్కోసారి తిండి కూడా ఉండేది కాదు..

విభిన్నమైన టాస్కులు.. ఎలిమినేషన్లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, ఏడుపులతో రచ్చరచ్చగా సాగిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు.. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం టోటల్ గా ఎమోషనల్ గా సాగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ ల చిన్ననాటి ఫోటో లను బిగ్ బాస్ చూపిస్తూ.. మెమోరీస్ షేర్ చేసుకోమని చెప్పడంతో ఒక్కొక్కరు తమ ఫీలింగ్స్ ని పంచుకున్నారు. అందులో భాగంగానే అరియనా గ్లోరీ తన చిన్నప్పటి సంగతులు షేర్ చేసింది.

మొదటగా అరియానా(ariyana glory) తన అసలు పేరు అర్చన అని తెలిపింది. కానీ.. ఇది ఎవరికీ చెప్తాననుకోలేదని అంది. తన తల్లి, చెల్లి ఫొటోని ఇంటి సభ్యులకు చూపించింది. తన లైఫ్ సీక్రెట్స్ గురించి మాట్లాడుతూ.. మా అమ్మ గవర్నమెంట్ నర్స్. మా అమ్మ నాన్నలది లవ్ మ్యారేజ్.. అ తర్వాత కొన్ని కారణాల వల్ల వారు విడాకులు తీసుకున్నారు.

అప్పుడు నాకు ఐదేళ్లు.. మా చెల్లి అమ్మ కడుపులో ఉండగా వారు విడిపోయారు. ఆ తరవాత అమ్మే అన్ని చూసుకుంది. పెంచింది. పెద్ద చేసింది. నా చిన్నప్పటి నుంచి మాకు మగదిక్కులేదు. బంధువులు, ఫంక్షన్లు కూడా ఏమీ ఉండేవి కావు.

ఇక ముందుగా తానూ యాంకరింగ్ చేస్తాను అంటే ఒప్పుకోలేదు.. దీనితో రూ. 4 వేలకు జాబ్‌లో జాయిన్ అయ్యాను..కానీ అందులో కూడా రాజకీయాలే.. ఒక్కోసారి తిండి కూడా ఉండేది కాదు.. రూ. 800, రూ. 500 కోసం కూడా ఈవెంట్స్ చేశాను. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇక్కడిదాకా వచ్చానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తన ఫస్ట్ లవ్ మిస్ అయినట్టుగా వెల్లడిచింది. కానీ అతను ఎవరు అన్నది వెల్లడించలేదు..

అయితే తనని తానూ చూసుకొని ఎంతో గర్వంగా ఫీల్ అవుతానని అరియనా చెప్పుకొచ్చింది. ఇక మిగతా ఇంటి సభ్యులు తమ తమ కుటుంబ సభ్యుల్ని గుర్తుతెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.దీంతో ఇంటిసభ్యుల ట్రాజెడీ సంఘటనలతో బిగ్‌బాస్‌ హౌజ్‌ బరువెక్కిపోయింది.

Next Story
Share it