Top
Batukamma

మళ్ళీ ధియేటర్లోకి బాహుబలి!

మళ్ళీ ధియేటర్లోకి బాహుబలి!
X
Highlights

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది..

తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి అని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది..

ప్రభాస్, రానా, అనుష్క , తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అఖండ విజయాన్ని అందుకొని రికార్డులను తిరగరాసింది.. ఇప్పటికీ కొన్ని రికార్డులు ఈ సినిమా పేరిటే పదిలంగా ఉన్నాయి..

అయితే ఈ సినిమా రెండు పార్టులుగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాని హిందీ వెర్షన్లలలో మరోసారి వెండితెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది.. బాహుబలి ది బిగినింగ్ ని ఈ నెల నవంబర్ 6 (శుక్రవారం) న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు..



ఇక బాహుబలి ది కంక్లూషన్ ను వచ్చేవారం అంటే నవంబర్ 13న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.. ఈ మేరకు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు.. అయితే ఆయా నగరాలలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఈ చిత్రాన్ని విడుదల ఉంటాయని కరణ్ జోహార్ తెలిపారు.

Next Story
Share it