Top
Batukamma

బెల్లంకొండ బాబు.. మాకేంటి ఈ నస!

బెల్లంకొండ  బాబు.. మాకేంటి ఈ నస!
X
Highlights

అల్లుడు అదుర్స్ అని టైటిల్ పెట్టినప్పుడే అందరికి ఎక్కడో తేడా కొట్టింది. ఇక టీజర్ చూశాక ఆ డౌట్ ని నిజం చేశారు. ఇందులో ఒక్కటంటే ఒక్క పాయింట్, సీన్ కూడా కొత్తది లేదు.

టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. మొదటి సినిమా అల్లుడు శీనుతో పర్వాలేదు అనిపించాడు కానీ ఆ తర్వాత తోపు లాంటి డైరెక్టర్స్ తో సినిమాలు చేశాడు కానీ హిట్స్ మాత్రం పడలేదు.. హిట్స్ పక్కన పెడితే బెల్లంకొండ శ్రీనివాస్ అంటేనే తలనొప్పి బాబోయ్ అనుకునేలా ప్రేక్షకులకు హడలెత్తించాడు

ఇక కష్టం ఈ బాబును హీరోగా చూడడం అనుకున్న టైంలో.. రాక్షసుడు సినిమాతో మెప్పించి అందరి నోళ్ళు మూయించాడు. ఇందులో మనోడి యాక్టింగ్ ఇంకో లెవల్ లో ఉంటుంది మరి. ఈ సినిమాతో మంచి సక్సెస్ ట్రాక్ ఎక్కిన బెల్లంకొండ బాబు కొంచం గ్యాప్ తీసుకొని కందిరీగ ఫేం సంతోష్ శ్రీనివాస్ తో 'అల్లుడు అదుర్స్' అంటూ సంక్రాంతికి వస్తున్నాడు.

సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమాకి సంబంధించిన టీజర్ ను కొద్దిసేపటి క్రితమే బయటకు వదిలారు మేకర్స్.. అల్లుడు అదుర్స్ అని టైటిల్ పెట్టినప్పుడే అందరికి ఎక్కడో తేడా కొట్టింది. ఇక టీజర్ చూశాక ఆ డౌట్ ని నిజం చేశారు. ఇందులో ఒక్కటంటే ఒక్క పాయింట్, సీన్ కూడా కొత్తది లేదు. అల్లుడు శీను,కందిరీగ ఇంకో రెండు మూడు సినిమాల సీన్స్ కలిపి అల్లుడు అదుర్స్ ఇక చూడండి అంటూ ప్రేక్షకుల మీదికి వదిలారు .. మళ్ళీ ఇందులోనూ.. అదే ప్రకాష్ రాజ్, అదే సోనుసూద్

మళ్లీ భారీ భారీ యాక్షన్ సీక్వెన్స్, భారీ సెట్స్ తో సాంగ్స్.. మైక్రో స్కోప్ పెట్టిన కూడా ఓ కొత్త పాయింట్ కూడా లేదు.. కానీ ఈ ట్రైలర్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్‌లో టాప్ ప్లేస్‌లో ఉంది. చూడాలి మరి అల్లుడు సంక్రాంతికి వచ్చి నిజంగానే అదుర్స్ అనిపిస్తాడో.. బెదుర్స్ అనిపిస్తాడో?


Next Story
Share it