జానపదం టూ ఐటమ్ బీట్స్... దుమ్మురేపుతున్న మంగ్లీ

ఇప్పటికే ఫుల్ బిజీగా అయిన మంగ్లీ ఈ సాంగ్ తో మరింత బిజీ అయిపోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
Bhoom Bhaddhal Lyrical Song by mangli: మంగ్లీ అలియాస్ సత్యవతి.. ఇప్పుడు తెలుగులో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న ఫోక్ సింగర్స్ లో టాప్ ప్లేస్ లో ఉందనే చెప్పాలి. జానపదంతో జనాలకు దగ్గరై ఇప్పుడు ఫుల్ మాస్ ఐటమ్ సాంగ్స్ తోనూ దుమ్మురేపుతోంది.
రవితేజ హీరోగా త్వరలో రాబోతున్న క్రాక్ మూవీలో మంగ్లీ ఓ ఐటమ్ సాంగ్ పాడింది. "భూమి బద్దలు... నా ముద్దుల సౌండు.." (Bhoom Bhaddhal Lyrical Song) అంటూ సాగే ఈ పాటను మంగ్లీ పాడింది. దీనికి సంబంధించిన లిరికల్ సాంగ్ ను ఇటీవల విడుదల చేశారు.
ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూట్ లో హల్చల్ చేస్తోంది. యూట్యూబ్ లో నాలుగో ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది.
రవితేజ అంటేనే మాస్ మహారాజ్.. అలాంటి మాస్ హీరో సినిమాలో మాంచి మాస్ ఐటం పడాలంటే.. అంత పవర్ ఉన్న వాయిస్ కావాలి. ఆ పవర్ ఫుల్ వాయిసే మంగ్లీది. అందుకే ఏరి కోరి మరీ మంగ్లీతో పాట పాడించారు డైరెక్టర్.
మంగ్లీ అంటే ఒకప్పుడు కేవలం ఫోక్ సాంగ్స్ మాత్రమే పాడగలదు అనే ప్రచారం ఉండేది. కొన్ని సినిమాల్లో పాడినా.. ఆ ఫోక్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించిందని చాలా మంది అన్నారు. కానీ.. ఫోక్ కు మాస్ బీట్ ఉన్న... ఆ చిన్న వేరియేషన్ ని గుర్తించింది మంగ్లీ. భూమి బద్దలు.. అంటూ.. తన వాయిస్ తో కుర్రకారు గుండెల్ని బద్దులు కొట్టేసింది.
ఇదొక్కటే కాదు.. ఇటీవల వచ్చిన ఆడనెమలి సాంగ్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎక్కడ చూసినా అదే పాట వినిపిస్తోంది.
ఆల్రెడీ ఫోక్ లో తన సత్తా చూపించింది మంగ్లీ. ఇప్పుడు ఐటం సాంగ్స్ ను అదరగొట్టేస్తానని నిరూపించింది. ఇప్పటికే ఫుల్ బిజీగా అయిన మంగ్లీ ఈ సాంగ్ తో మరింత బిజీ అయిపోవడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్.
- Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి!
- చెప్పేది శ్రీరంగ నీతులు.. వేసుకునేవి సగం బట్టలు!
- బావా.. బావా.. అంటూ జబర్దస్త్ బాక్స్ బద్దలుకొట్టింది..!
- వచ్చే నెలలో 100 మిలియన్ డోసుల కరోనా వ్యాక్సిన్..!
- డిఫరెంట్ లుక్ లో యాంకర్ శ్రీముఖి..