Top
Batukamma

పునర్నవి పెళ్లి ఫిక్స్.. మరి రాహుల్ భయ్యా పరిస్థితి ఏంటి?

పునర్నవి పెళ్లి ఫిక్స్.. మరి రాహుల్ భయ్యా పరిస్థితి ఏంటి?
X

 punarnavi bhupalam 

Highlights

దీనితో వరుడు ఎవరో తెలుసుకోవాలని ఆత్రుతలో అభిమానులు ఉన్నారు.. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో మంచి లవ్‌ట్రాక్‌ నడిచింది పునర్నవి..

సినీ హీరోయిన్, బిగ్ బాస్-3 కంటెస్టెంట్ పునర్నవి భూపాలం పెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ' ఫైనల్లీ ఇట్స్ హ్యాపెనింగ్' అని సోషల్ మీడియలో పోస్ట్ చేసింది పునర్నవి .. అయితే తన కాబోయే భర్త తన చేతిని పట్టుకున్న ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఈ ఫొటోలో తన ఫియాన్సీ ముఖాన్ని ఆమె చూపించలేదు.

దీనితో వరుడు ఎవరో తెలుసుకోవాలని ఆత్రుతలో అభిమానులు ఉన్నారు.. ఇక బిగ్ బాస్ సీజన్ 3లో సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌తో మంచి లవ్‌ట్రాక్‌ నడిచింది పునర్నవి.. దీనితో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని అందరు అనుకున్నారు. ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో చూసిన ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రశ్నలు ఎదురయ్యేవి .. కానీ తాము మాత్రం మంచి స్నేహితులమే అంటూ చెప్పుకొచ్చారు వీరిద్దరూ..

నేడే ధరణి పోర్టల్ ప్రారంభం.. ధరణి ప్రత్యేకతలివే!

పునర్నవి పెళ్లి ఫిక్స్ అయిపోవడంతో రాహుల్ భయ్యా పరిస్థితి ఏంటి అంటూ కొందరు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. అటు ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలో నటించి పునర్నవి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ ఆమెకి అంత గుర్తింపు రాలేదు.. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ లో నటిస్తోంది పునర్నవి..

View this post on Instagram

Finally! It's happening 🥰❤️

A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) on

Next Story
Share it