బిగ్ బాస్ పక్కా ప్రీ ప్లాన్డ్ గేమ్. ఇదుగోండి ప్రూఫ్..!

బిగ్ బాస్ అంతా ఊహించినట్టుగానే జరుగుతుంది. ఎవరు ఏలిమినేషన్ కాబోతున్నారో ముందుగానే తెలిసిపోతుంది
బిగ్ బాస్ అంతా ఊహించినట్టుగానే జరుగుతుంది. ఎవరు ఏలిమినేషన్ కాబోతున్నారో ముందుగానే తెలిసిపోతుంది. ఒక్క దేవి నాగవల్లి విషయంలో తప్పా ఎక్కడ కూడా బిగ్ బాస్ యూటర్న్ తీసుకోలేదు..
ఇది ఇలా ఉంటే గతవారం జోర్ధార్ సుజాత హౌస్ నుంచి బయటకు వచ్చేసింది.. వాస్తవానికి సుజాత ఎప్పుడో ఏలిమినేషన్ కావాల్సింది కానీ, ఆమె ఏలిమినేషన్ లో లేకపోవడం వల్ల ఇన్ని రోజులు షోలో కంటిన్యూ అవుతూ వచ్చింది..
అయితే ఆమె బయటకు రావడానికి నాగ్ ఫ్యాన్స్ కారణం అంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతూ వస్తోంది.. ఎందుకంటే షోలో నాగార్జునను పట్టుకొని బిట్టూ బిట్టూ అంటూ పిలవడం నాగ్ ఫ్యాన్ కి ఎక్కడో కాలింది..
అలా తమ అభిమాన నటుడిని పిలవడం ఫ్యాన్స్ కి చిరాకు తెప్పించింది. ఇక ఎప్పుడైతో ఆమె నామినేషన్ లోకి వచ్చిందో అప్పుడే ఆమెను నాగ్ ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేశారంటూ న్యూస్ స్ప్రెడ్ అయింది.. ఇది కాస్తా సుజాత వరకు వెళ్ళింది.
తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో సుజాత మాట్లాడుతూ నాగ్ సార్ ని అలా పిలవమని బిగ్ బాస్ నిర్వహకులే చెప్పారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది..
"షోకి వెళ్ళగానే నీకు నాగార్జున అంటే ఇష్టమా అని అడిగారు.. అవును ముఖ్యంగా మనం సినిమాలో ఆయన చేసిన బిట్టూ పాత్ర అంటే ఇంకా ఇష్టం.. నాగార్జునని అలా పిలవడం నీకు ఇష్టం అయితే అలాగే పిలువు అని వాళ్ళు చెప్పారు. నేను అలా పిలిచినప్పుడు కూడా నాగార్జున సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు" అని సుజాత చెప్పుకొచ్చింది.
అయితే ఇది నాగ్ సార్ అభిమానులకు బాధ కలిగిస్తే క్షమించండి. నేను కావాలని మాత్రం పిలవలేదని సుజాత చెప్పుకొచ్చింది..