Top
Batukamma

తుస్సుమన్న బిగ్ బాస్.. చిన్న సీరియల్స్ ముందు ఢమాల్..!

తుస్సుమన్న బిగ్ బాస్.. చిన్న సీరియల్స్ ముందు ఢమాల్..!
X

BiggBoss4 Telugu

Highlights

పసలేని టాస్క్ లు, హౌస్ ని లవర్స్ పార్క్ లుగా మార్చేయడం.. ఇంగ్లీష్ మాటలు, ఆరవమేళం, కంటెస్టెంట్ ల ఓట్ల తేడాలు..ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి..

నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగు మొదటి వారం బాగా నడిచి, అత్యధిక రేటింగ్ సంపాదించి, బిగ్ బాస్ హిస్టరీ లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. అసలు మొదలు అవుతుందా లేదా అనుకున్న ఈ షోకి ఈ రేంజ్ లో రేటింగ్ రావడంతో అంచనాలు మరింత పెరిగాయి.

అయితే ఆ తర్వాత పసలేని టాస్క్ లు, హౌస్ ని లవర్స్ పార్క్ లుగా మార్చేయడం.. ఇంగ్లీష్ మాటలు, ఆరవమేళం, కంటెస్టెంట్ ల ఓట్ల తేడాలు..ఇవన్నీ బుల్లితెర ప్రేక్షకులకు విసుగు తెప్పించాయి.. ఇక మోనాల్ వేసే డ్రెస్సులు చూసి అయితే ఫ్యామిలీ ఆడియన్స్ షో చూడాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.

దీనితో బిగ్ బాస్ రేటింగ్లు అమాంతం పడిపోయాయి.. ఈ వీక్ డేస్‌లో కేవలం 8.35 మాత్రమే పరిమితం అయ్యింది. అంటే మొదటి వీక్ కి , ఈ వీక్ చాలా తేడా వచ్చింది. వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడు మాత్రం 11 రేటింగ్ తో సాగుతుంది బిగ్ బాస్.. అయితే మాటీవీ లో టాప్ లో ఉన్న కార్తీక దీపం సీరియల్ నీ బీట్ చేయకున్నా కనీసం మిగతా సీరియల్స్ తో కూడా పోటీ పడలేకపోతుంది బిగ్ బాస్..

వదినమ్మ, గృహలక్ష్మి, దేవత, చెల్లెలి కాపురం లాంటి సీరియల్స్‌ని కూడా బీట్ చేయలేకపోతుంది బిగ్ బాస్. కార్తీకదీపం సీరియల్‌కి 18.56 రేటింగ్ వస్తే, ఇంటింటి గృహలక్ష్మి 14.80, వదినమ్మ 12.23, దేవత 9. 69, చెల్లెలి కాపురం 8. 28 రేటింగ్‌ని సాధించాయి. ఈ రేటింగ్స్ లెక్కలు 40 వారం జీఈసీ ప్రైమ్ టైమ్స్ రేటింగ్స్.

Next Story
Share it