త్రివిక్రమ్ కి వెరైటీ బర్త్ డే విషెస్

నేను Help చేసిన వాడు కనీసం నావైపు చూడట్లేదు, దరిద్రానికి మరి దగ్గరగా బ్రతుకుతున్నా అనుకునే టైం లో...... మన జీవితంలోకి ఒకడు వచ్చి ఒక మాటను దైర్యంగా చెప్తాడు,
"వినే టైం చెప్పే మనిషి వలన విషయం విలువే మారిపోతుంది"
ఎందుకు నాకు ఈ జీవితం.?
సమాజంలో ఉన్న కష్టాలు అన్నింటినీ నేనె మోస్తున్నాను,
నేను Help చేసిన వాడు కనీసం నావైపు చూడట్లేదు,
దరిద్రానికి మరి దగ్గరగా బ్రతుకుతున్నా అనుకునే టైం లో......
మన జీవితంలోకి ఒకడు వచ్చి ఒక మాటను దైర్యంగా చెప్తాడు,
అరేయ్ ఇవి పెద్ద కష్టాలే కావు,
నీ స్టామినా ఏంటి ,
ఈ ప్రాబ్లెమ్ నీకు ఒక ఈక....
అని మాములు మాటను చెప్పినా...
ఆ విషయాలే మనకు ఒక కొండంత ధైర్యాన్ని ఇస్తాయి,
ఎందుకంటే నువ్వు దరిద్రంలో ఉన్నప్పుడే వాడు ధైర్యం చెప్పాడు అందుకే వాడు చెప్పిన విషయానికి అంత వాల్యూ ఇచ్చావ్.
అదే
"వినే టైం చెప్పే మనిషి వలన విషయం విలువే మారిపోతుంది"
ఒక బిడ్డకు ఏమైనా జరిగితే తన తల్లి తట్టుకోలేదు,
పాతికేళ్లు పెంచిన కొడుక్కి అనుక్షణం ఏమవుతుందో అనే భయం,వీడు పోతే తర్వాత నేను ఎవరికోసం బ్రతకాలి.?
అనే ఆలోచన నరకమే కదా.....
అదే
మనకు వస్తే కష్టం మన వాళ్ళకి వస్తే నరకం
"ఇష్టంగా అనుకునేది అదృష్టం
బలంగా కోరుకునేది భవిష్యత్"
అనుకోవడం వేరు,కోరుకోవడం వేరు
అనుకునేదాని మీద పెద్దగా ఆశ ఉండదు జస్ట్ అనుకుంటాం అంతే అది అయిపోతే మన అదృష్టం.
కోరుకునేదానిపైన ఆశ ఉంటుంది,
అదే మన ఆశయం అవుతోంది,
అది సాధించాలని సంకల్పం మనలను వెంటాడుతుంది,
పనిచేస్తే ఫలితం వస్తుంది అదే మన భవిష్యత్ అవుతుంది.
అదే
ఇష్టంగా అనుకునేది అదృష్టం
బలంగా కోరుకునేది భవిష్యత్
త్రివిక్రమ్ పెన్ నుంచి వచ్చిన ఇలాంటి బోలెడు మాటలు
నన్ను కదిలించి,ఆలోచించేలాగా చేసాయి.
మనమీద మనకు సాధించగలం అనే నమ్మకం ఉంటే చాలు ఏదైనా చెయ్యొచ్చు అని ఋజువు చేసిన వ్యక్తి త్రివిక్రమ్.తనను తాను బాగా నమ్మాడు,
నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో
రైల్వే స్టేషన్ లో టికెట్ కలక్టర్ వెంకటేష్ ను టికెట్ అడిగితే,
వెంకటేష్ ఏదో చెబుతున్నప్పుడు.....
"నీకు రైటర్ గా మంచి భవిష్యత్ ఉంది కానీ"
ముందు టికెట్ తియ్ అంటాడు.
నువ్వే కావాలి లో ఎమ్.ఎస్ నారాయణ అంటాడు
కావాలి అంటే నువ్వు విచలిత ను తిట్టు
రచయితను తిట్టకు
ఎందుకంటే ఆ డైలాగ్ రాసిందే నేనె అంటాడు.
ఒక రచయిత గా తాను నిలదొక్కుకుంటాను అనే నమ్మకం ఎప్పటినుంచో ఉంది త్రివిక్రమ్ కి,
అక్షరం చాలా అందమైనది
పదాలకు కూడా ప్రాణం ఉంటుంది
వాక్యాలతో విలువలు చెప్పొచ్చు
అని నేర్పించి........
నా ఖాళీ కాబోర్డులను పుస్తకాలతో,
నా మాములు మెదడును సాహిత్యంతో నింపిన త్రివిక్రమ్ గారికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు.!
-