Top
Batukamma

డైరెక్టర్ రాజమౌళికి బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్

డైరెక్టర్ రాజమౌళికి బీజేపీ ఎంపీ స్ట్రాంగ్ వార్నింగ్
X
Highlights

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న త్రిబుల్ ఆర్ చిత్రం ఇప్పుడు వివాదంలో చిక్కుకుంది. కొమరం భీం ని ముస్లిం గెటప్ లో చూపించడం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Komaram Bheem Teaser: టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తున్న చిత్రం RRR.. బాహుబలి లాంటి భారీ హిట్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తుండడం సినిమాకి మరో ప్లస్..

ఇప్పటికే సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన అల్లూరి సీతారామరాజు ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్.. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అ తరవాత కొంచం గ్యాప్ ఇచ్చి దసరా కానుకగా ఎన్టీఆర్ కొమరం భీమ్ ఇంట్రో వీడియోని రిలీజ్ చేశారు.

అయితే కొమరం భీమ్ టీజర్ చివర్లో ఎన్టీఆర్ (కొమరం భీమ్) ముస్లిమ్స్ ధరించే క్యాప్ ని పెట్టుకొని ఆ గెటప్ లో రావడం పట్ల సోషల్ మీడియాలో కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది... చరిత్రను రాజమౌళి వక్రీకరిస్తున్నాడంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా దర్శకుడు రాజమౌళికి ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు వార్నింగ్ ఇచ్చారు. చరిత్ర తెలియకుండా సినిమాలు తీస్తే ఎవ్వరూ ఊరుకోరని.. అదే విజువల్స్ తో సినిమా విడుదల చేస్తే థియేటర్లు తగులబెట్టే అవకాశం ఉందన్నారు. కలెక్షన్ల కోసం తమ ఆరాధ్య దైవాన్ని కించపరిస్తే సహించబోమని.. భీమ ను చంపిన వాళ్ల టోపీ ఆయనకు పెట్టడం ఆదివాసీయులను అవమానించడమేనన్నారు.

Next Story
Share it