Top
Batukamma

Kangana Ranaut : కంగనా రనౌత్ పై కేసు... ఎందుకంటే..?

Kangana Ranaut : కంగనా రనౌత్ పై కేసు... ఎందుకంటే..?
X
Highlights

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇష్యూలో సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్ గా మారిన కంగనా.. ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది.

Kangana Ranaut : బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై కేసు నమోదైంది. ముంబైలో ఆమెపై కేసు ఫైల్ అయ్యింది. మతాల మధ్య చిచ్చు పెట్టి.. మత ఘర్షణలు చెలరేగే విధంగా కంగనా కామెంట్స్ చేస్తున్నారంటూ ఈ కేసు నమోదైంది.

ముంబై కి చెందిన డైరెక్టర్ సాహిల్ సయ్యీద్.. కంగనా రనౌత్ పై కోర్టును ఆశ్రయించారు. కొద్ది రోజులుగా కంగనా రనౌత్ చేస్తున్న ట్వీట్లు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. బాలీవుడ్ పరిశ్రమలోని నటుల మధ్య మతం పేరుతో విభేదాలు సృష్టించేలా ఆమె కామెంట్స్ ఉన్నాయని ఆరోపించారు.

కంగనా రనౌత్ తో పాటు ఆమె సోదరి కూడా బాలీవుడ్ ను డీ ఫేమ్ చేస్తున్నారంటూ ఆరోపించారు పిటిషనర్. ఇద్దరు సెలబ్రిటీలు కాబట్టి.. వీరు చేసే ట్వీట్లు లక్షలాది మందిని ప్రభావితం చేస్తాయని.. వారిపై చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోర్టును కోరారు.

వీరిద్దరిపై ఐపీసీ 153 A శత్రుత్వాన్ని రెచ్చగొట్టడం, 295A మత విశ్వాసాలకు వ్యతిరేకంగా మాట్లాడటం, 124A దేహద్రోహం కేసు పెట్టాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన బాంద్రా మెట్రోపాలిటన్ కోర్టు వారిపై కేసు ఫైల్ చేయాలని పోలీసులను ఆదేశించింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత కంగనా రనౌత్ మీడియాలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు. రియా చక్రవర్తే సుశాంత్ ను చంపారంటూ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం పెరిగిపోయిందంటూ కామెంట్స్ చేశారు.

అక్కడితో ఆగని కంగనా.. ముంబైలోని శివసేన సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో సర్కారు, కంగనా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ గొడవల నేపథ్యంలో ఆమెకు Y కేటగిరి భద్రత కల్పించింది కేంద్రం. ఈ ఇష్యూ కొద్ది రోజుల క్రితం సంచలనంగా మారింది

Next Story
Share it