Top
Batukamma

సునీత బాటలోనే సురేఖవాణి... రెండో పెళ్లికి రెడీ.. !

సునీత బాటలోనే సురేఖవాణి...  రెండో పెళ్లికి రెడీ.. !
X
Highlights

తల్లి, కోడలు, భార్య పాత్రల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సురేఖవాణి..

ఎప్పుడు నవ్వుతూ కనిపించే సినీ తారల జీవితంలో కూడా ఎన్నో విషాదాలు ఉంటాయి. కానీ వాటిని దిగమింగకుంటూ తెర మీద మాత్రం నవ్వూ పూసుకుని కనిపిస్తుంటారు. అందులో నటి సురేఖవాణి కూడా ఒకరు..

తల్లి, కోడలు, భార్య పాత్రల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది సురేఖవాణి.. 43 ఏళ్ల సురేఖావాణి ఫిజిక్ మెయింటేన్ చేసే విషయంలో హీరోయిన్స్ ని మైమరిపిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే సురేఖావాణి సురేష్ తేజ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం కావడం విశేషం. సురేష్ నటుడుగా పలు సినిమాల్లో నటించారు. అంతేకాకుండా మా టాకీస్, హార్ట్ బీట్, మొగుడ్స్ పెళ్లామ్స్ వంటి ప్రోగామ్స్‌కు దరకత్వం వహించారు.


ఆ సమయంలోనే సురేఖావాణి తన భర్త దర్శకత్వంలో వచ్చిన మొగుడ్స్ పెళ్ళామ్స్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించింది. అయితే 2019లో అనారోగ్యం కారణంగా సురేఖ వాణి భర్త సురేష్ తేజ మరణించిన విషయం తెలిసిందే. దీనితో ఆమెకి కష్టాలు మొదలయ్యాయి.

సినిమాల తగ్గాయి. ఒకప్పుడు వరుస సినిమాలలో కనిపించే సురేఖావాణి ఇప్పుడు అడపాదడపా సినిమాలలో కనిపిస్తోంది. తన కూతురుతో కలిసి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా కనిపిస్తున్నప్పటికీ లోపల మాత్రం ప్రేమించిన భర్తను కోల్పోయాననే బాధ మాత్రం అలాగే ఉండిపోయిందట.

అయితే తల్లి బాధను చూసి సురేఖవాణి కూతురు ఆమెను మళ్ళీ పెళ్ళి చేసుకోమనే ప్రపోజల్ పెట్టిందంట. అయితే దీనికి కూడా ఆమె అంగీకరించినట్టుగా తెలుస్తోంది. కాగా ఇటీవలే టాలీవుడ్ సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story
Share it