Top
Batukamma

సుడిగాలి సుధీర్‌కు క‌రోనా పాజిటివ్?

సుడిగాలి సుధీర్‌కు క‌రోనా పాజిటివ్?
X
Highlights

Sudigali sudheer : కరోనా అందరి అంతు చూసే దాకా వదిలేలా లేదు.. ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది. అయితే దీని ప్రభావం ఎక్కువగా సినిమా సెలబ్రిటీల పైన ఎక్కువగా ఉంది.

Sudigali sudheer : కరోనా అందరి అంతు చూసే దాకా వదిలేలా లేదు.. ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది. అయితే దీని ప్రభావం ఎక్కువగా సినిమా సెలబ్రిటీల పైన ఎక్కువగా ఉంది. లాక్ డౌన్ సడలింపులో భాగంగా షూటింగ్ లకి అనుమతులు లభించాకా చాలా మంది బుల్లితెర, వెండితెర ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. అందులో భాగంగానే జబర్దస్త్ నటుడు సుడిగాలి సుధీర్ కి కూడా కరోనా సోకిందని తెలుస్తోంది.

ఈ నెల 18 న సుధీర్ కరోనా బారిన పడినట్టుగా తెలుస్తోంది. ప్ర‌స్తుతం సుధీర్ స్వీయ గృహ నిర్బంధంలో వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపైన అధికార ప్రకటన రావాల్సి ఉంది. ఇక సుధీర్ కి కరోనా అని తెలియగానే అయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఒకవేళ సుధీర్ కి కరోనా రావడం పక్కా అయితే సుధీర్ పాల్గొన్న షోలోని సభ్యులు అందరూ కరోనా పరీక్షలు చేసుకోక తప్పదు..

ఇక ఈ మధ్యకాలంలో ద‌స‌రా స్పెష‌ల్‌ ఈవెంట్ 'అక్కా ఎవ‌డే అత‌గాడు' అనే షో ని చేశాడు సుధీర్.. ఈ షోలో ర‌ష్మీ, వ‌ర్షిణి, సంగీత‌, శేఖ‌ర్ మాస్ట‌ర్ తదితరులు పాల్గొన్నారు. అటు సుధీర్ జబర్దస్త్ షో చేస్తున్న సంగతి తెల్సిందే.. ఇందులో రామ్ ప్రసాద్, సన్నీ, శ్రీను లు కూడా ఉంటారు. దీనితో వీరికి కూడా క‌రోనా సోకే అవ‌కాశాలున్నాయి.

Next Story
Share it