Top
Batukamma

అల్లూరికి సిక్స్ ప్యాక్ ఉండేనా..? కొమరం భీం అంతపొట్టిగా ఉండేనా?

అల్లూరికి సిక్స్ ప్యాక్ ఉండేనా..? కొమరం భీం అంతపొట్టిగా ఉండేనా?
X
Highlights

20 ఏండ్ల కిందటనే కొమురం భీం మీద సినిమా తీశిండు అల్లాణి శ్రీధర్ అనే పెద్దాయన.. ముక్కి ములిగి 15 ఏండ్ల పురిటి నొప్పుల తర్వాత ఐదారేండ్ల కిందట బయటికొచ్చింది..

20 ఏండ్ల కిందటనే కొమురం భీం మీద సినిమా తీశిండు అల్లాణి శ్రీధర్ అనే పెద్దాయన.. ముక్కి ములిగి 15 ఏండ్ల పురిటి నొప్పుల తర్వాత ఐదారేండ్ల కిందట బయటికొచ్చింది.. అది ఎంత మంది సూశిర్రో నాకు తెల్వదు.. అంతెందుకు నేనే మొత్తం సూడలే యూట్యూబ్ల కొన్ని సీన్స్ తప్ప.. ఇగ మన సర్కారు ఏమన్న సాయం చేశిందో లేదో ఎవలికి తెల్వదు..

ఏందంటే ఇప్పుడు రాజమౌళి అట్లెట్ల తీస్తడు, చరిత్ర మొత్తం తిర్లమర్ల చేస్తడు అని పిసుక్కునుడు తప్ప ఏముండదు.. ముంగటనే చెప్పే ఇది పుట్టించిన కథ అని.. అల్లూరి సీతారామరాజుకు సిక్స్ ప్యాక్ ఉండెనా, కొమురం భీం అంత పొట్టిగ ఉండెనా అని మనం అనుకుంట కుసుంటం.. రేపు సైన్మా పరదా మీద ఆడినంక నైజాంల 500 కోట్లు వసూలు చేశిందట అనంగనే సల్లవడుతం.. ఎందుకంటే మెజారిటీ సినిమా చూశేది మూడు గంటల మజా కోసం ఇది వాస్తవం..



పైనయి రెండు సినిమాలే.. కానీ రెండోదానికున్నంత హైప్ మొదటిదానికి లేదు.. పూరి జగన్నాథ్ చెప్పినట్టు గాంధీ సినిమా ఇండియాలో 100 రోజులు ఆడదు.. "కడప కింగ్" అని తియ్యి, 200 డేస్ 200 సెంటర్స్.. అట్లనే ఇది కూడా.. "కొమురం భీం" అని తీస్తే ఎవరం సూడలే.. రణం, రౌద్రం, రుధిరం అని ఏదో తీస్తే మా కొమురం భీం అని కొట్లాడుకుంటున్నం.. ఆల్లకేముంది మల్లో2000 కోట్లు గల్లాల ఏస్కుంటరు..

అయినా ఇక్కడ పెద్దసారు చెప్పిందే చరిత్ర.. నిజాం రాజు బూజంటే బూజు, దేవుడంటే దేవుడు.. అప్పుడు విమోచనం ఇప్పుడు ఓట్ల మయం.. వాడు మందోడు అంటే మందోడు మనోడు అంటే మనోడు.. చరిత్రదేముంది బలవంతుడెటు తిప్పితే అటే మలుగుతది.. రేపు రేపు కేసీయార్ కుటుంబం వల్లనే తెలంగాణ ఒచ్చింది అంటే మన పోరగాండ్లు సదవరా ఏంది.. ఇది కూడా రేపటికి చరిత్రనే..



Abhinayalavly

Next Story
Share it