Top
Batukamma

దీపికా పదుకునే రోజు కూలీ రూ.200..!

దీపికా పదుకునే రోజు కూలీ రూ.200..!
X
Highlights

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పడుకొన్ ఉపాధి కూలీగా మారింది. వీరు . దీపికా పదుకునే కూలీ పని చేసుకుని బతుకుతోంది.

బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనె ఉపాధి కూలీగా మారింది. వీరు చదివింది నిజమే.. దీపికా పదుకొనె కూలీ పని చేసుకుని బతుకుతోంది. అయితే.. ఇది ముంబైలో మాత్రం కాదు. మధ్యప్రదేశ్ లోని ఓ గ్రామంలో. అయితే.. అక్కడున్నది నిజమైన దీపిక పదుకునే కాదు.

అసలు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ లోని ఖర్గోన్ జిల్లాలోని ఓ గ్రామంలో దీపికాతో పాటు.. చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు ఉపాధి కూలీలుగా మారారు. అంటే.. వీరి ఫొటోలతో ఉపాది హామీ కార్డులు జారీ అయ్యాయి. కార్డులు మాత్రమే కాదు. నెలనెలా లక్షల్లో చెల్లింపులు కూడా జరుగుతున్నాయి.

లక్షలాది రూపాయలు చెల్లింపులు జరుగుతున్నా పట్టించుకునే వారు మాత్రం లేకుండా పోయారు. పీపర్కేడా నాకా అనే గ్రామంలో ఈ తతంగం నడుస్తోంది. గ్రామానికి చెందిన సోనుశాంతిలాల్, మనోజ్ దూబే అనే ఫ్యామిలీ పేరుతో ఓ జాబబ్ కార్డ్ ఇష్యూ అయ్యింది. అయితే అందులో వారి ఫొటోకు బదులు.. దీపికా పదుకొనె ఫొటో పెట్టారు. వీరొక్కరి కార్డే కాదు.. గ్రామంలో డజన్ కు పైగా ఇలా బాలీవుడ్ సెలబ్రిటీల ఫొటోలతో కార్డులు జారీ అయ్యాయి.



వీరు రోజు పనిచేస్తున్నట్టు లెక్కలు కూడా అప్పజెబుతున్నారు స్థానిక పంచాయతీ కార్యదర్శి. స్థానికంగా డ్రైనేజేలు నిర్మించారని బిల్లులు చెల్లించారు. అలాగే కుంటలు తవ్వారని ఏకంగా ఈ ఫేక్ కార్డులకు 30 వేలకు పైగా చెల్లించారు.

ఇందులో అసలు యవ్వారం మాత్రం వేరే ఉంది. నిజానికి మనోజ్ దూబే అనే వ్యక్తి అక్కడ భూస్వామి. ఆయనకు 50 ఎకరాల భూమి ఉంది. దీంతో ఆయనకు జాబ్ కార్డు ఇవ్వలేదు. కానీ ఆయన పేరుతో, ఆయన భార్య పేరుతో ఫేక్ జాబ్ కార్డు తయారు చేశారు స్థానిక కార్యదర్శి. ఏదో ఓ చోట పనులు చేసినట్టు చూపించి నెల నెలా వేలకు వేలు డ్రా చేస్తున్నారు. ఇప్పటికే లక్షలాది రూపాయలు వారి చేతుల్లోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

Next Story
Share it