Top
Batukamma

దేత్తడి హారికకు బంప‌రాఫ‌ర్.. ఏకంగా తెలంగాణ ప్రభుత్వంలో పోస్ట్...!

దేత్తడి హారికకు బంప‌రాఫ‌ర్.. ఏకంగా  తెలంగాణ ప్రభుత్వంలో పోస్ట్...!
X
Highlights

దేత్తడి హారిక అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండరు... సొంత యూట్యూబ్‌ ఛానల్ తో ఫుల్ ఫేం అయిన హారిక... బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెలబ్రిటీ అయింది.

దేత్తడి హారిక అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఉండరు... సొంత యూట్యూబ్‌ ఛానల్ తో ఫుల్ ఫేం అయిన హారిక... బిగ్‌బాస్‌లోకి వెళ్లి సెలబ్రిటీ అయింది. అక్కడ అందరి నుంచి పోటిని తట్టుకుంటూ.. టాప్ 5వ‌ర‌కు వెళ్ళింది. ఇక బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత అడపాదడపా అవకాశాలను అందిపుచ్చుకుంటూనే త‌న యూట్యూబ్ ఛానెల్‌ని కొనసాగిస్తుంది.

అయితే ఇదిలా ఉంటే.. ఇప్పుడు హ‌రిక‌కు బంప‌రాఫ‌ర్ వ‌చ్చింది. ఏకంగా తెలంగాణ ప్రభుత్వంలో పోస్ట్ కొట్టేసింది ఈ బ్యూటీ.. తెలంగాణ టూరిజం అంబాసిడ‌ర్‌గా హారిక‌కు ఆఫ‌ర్ వ‌చ్చింది. మహిళా దినోత్సవం సందర్బంగా హరికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్నీ హారిక తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.

Next Story
Share it