Top
Batukamma

వకీల్ సాబ్ టీజర్ లో ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?

వకీల్ సాబ్ టీజర్ లో ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా?
X
Highlights

కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన వకీల్ సాబ్ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది. పవన్ కం బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయిన వకీల్ సాబ్ టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది. పవన్ కం బ్యాక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పవన్ వచ్చాడు.. మిగతా హీరోలు తట్టాబుట్టా సర్దుకోవాలి.. బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వుద్ది అంటూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అయితే చిత్ర టీజర్ లో మెట్రోలో కనిపించి కనిపించనట్టుగా ముగ్గురు అమ్మాయిలను చూపించారు మేకర్స్. ఇందులో ఇద్దరు చూడగానే తెలిసిపోతున్నారు. వాళ్ళే అంజలి నివేతా థామస్. అయితే ఇంకో అమ్మాయి ఎవరనే చర్చ సోషల్ మీడియాలో వీపరితంగా నడుస్తోంది.

ఆ అమ్మాయి ఎవరో కాదు... కమెడియన్ ప్రియదర్శి హీరోగా వచ్చిన మల్లేశం సినిమాలో పద్మగా నటించిన అనన్య నాగళ్ల..అవును.. మల్లేశంలో చీర కట్టులో కనిపించిన అనన్య ఆడియన్స్ కి అలాగే గుర్తుండిపోయింది. వకీల్ సాబ్ లో పాయింట్ షర్ట్ వేసేసరికి తొందరగా గుర్తుపట్టలేకపోయారు.

వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాని, దిల్ రాజు, బోనికపూర్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.











Next Story
Share it