Top
Batukamma

ఉప్పెన సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ ఈమెనట.. !

ఉప్పెన సినిమాకి ముందుగా అనుకున్న హీరోయిన్ ఈమెనట.. !
X
Highlights

వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.

నీ కన్ను నీలి సముద్రం అనే ఒక్క పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఉప్పెన మూవీ.. వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. అయితే ఈ సినిమాకి ముందే ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపొయింది కృతిశెట్టి...

ఆమె క్యూట్ లూక్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి. దీనికి తోడు సినిమాలోని ఆమె నటనకి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం బెబమ్మ వైపే చూస్తుంది. అయితే ఈ సినిమాకి ముందుగా కృతిశెట్టిని హీరోయిన్ గా అనుకోలేదట బుచ్చిబాబు .. ముందుగా మనీషా రాజ్ అనే ఓ తెలుగమ్మాయినే హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాడట..

ఆమెతో కథ సంప్రదింపులు కూడా అయిపోయాయి. ముహూర్తపు షాట్ కి కూడా ఆమె వచ్చిందట.. అయితే ఎందుకో హీరోయిన్ ను చేంజ్ చేయాలనీ అనుకున్నాడట బుచ్చిబాబు.. ఇదే విషయం గురించి కొన్ని రోజులు తర్జనభర్జన అవుతుంటే... దర్శకుడు సుకుమార్ కి విషయం చెబితే.. నీ సినిమా, నీ ఇష్టం.. రేపు యాక్షన్, కట్ చెప్పాల్సింది నువ్వేనని.. ఎవరికీ ఏది కావాలి కాదు.. సినిమాకి ఎదో కావాలో అదే చెయ్ అని సలహా ఇచ్చారట.

అలా కన్నడ నుంచి కృతిశెట్టిని తీసుకున్నాడట బుచ్చిబాబు.. ఆమె కూడా త్వరగానే తెలుగు నేర్చుకొని బాగా నటించిందని, ఈ రోజు సినిమా రిలీజ్ కాకముందే స్టార్ హీరోయిన్ అయిపోయిందని బుచ్చిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇక ఈ మనీషా రాజ్.. ఎవరో కాదు.. ఎన్ కౌంటర్ దర్శకత్వంలో సునీల్ హీరోగా వచ్చిన టూ కంట్రీస్ మూవీలో హీరోయిన్ గా నటించింది.


Next Story
Share it