Top
Batukamma

క్లోజ్ అయిన కేసు రీ ఓపెన్ అయ్యింది..! దొరికిపోయినట్టేనా..?

drishyam 2 trailer review
X
Highlights

ట్రైలర్ చూస్తే.. ఇది మొదటి సినిమా కన్నా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

దృశ్యం(drishyam).. మూవీ ఇండస్ట్రీని ఎంతలా ఊపేసిందో అందరికి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగిన ఈ మూవీ... సినిచరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. మళయాళం(Malayalam)లో మోహన్ లాల్(mohanlal) ప్రధానపాత్రలో వచ్చిన ఈ మూవీని.. తెలుగులో వెంకటేష్(venkatesh) తో తీశారు. ప్రతీక్షణం ఉత్కంఠరేపిన ఈ మూవీకి సీక్వెల్ కూడా వచ్చేస్తోంది.

గతంలో ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయినా.. ఈ సారి మాత్రం ఓటీటీ ప్లాట్ ఫాంకు పరిమితం చేశారు. అమెజాన్ ప్రైమ్(amazon prime video) లో దృశ్యం 2 మూవీ రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఇందులోనూ మోహన్‌లాల్‌, మీనా(meena) ప్రధాన పాత్రల్లో కనిపించారు. ట్రైలర్ చూస్తే.. ఇది మొదటి సినిమా కన్నా సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉండబోతోందని తెలుస్తోంది.

ఎందుకంటే దృశ్యంలో క్లోజ్ చేసిన మర్డర్ కేసును దృశ్యం 2(drishyam 2 trailer)లో రీఓపెన్ చేసినిట్టుగా కనిపిస్తోంది. మోహన్ లాల్ ఉంటున్న ఊరికి కొత్తగా వచ్చిన ఎస్సై.. కేసును రీ ఓపెన్ చేస్తాడు. అసలు దాని వెనుక ఏదైనా కారణం ఉందా? అసలు మోహన్‌లాల్‌ ఫ్యామిలీ(mohanlal family) గురించి ఊళ్లో వాళ్లు ఏమనుకుంటున్నారు.? కుటుంబ సభ్యుల ఆలోచనలు ఎలా ఉన్నాయనేది ట్రైలర్‌లో చూపించారు.

దృశ్యం సినిమా చూసిన ప్రతీఒక్కరు.. దృశ్యం 2 ట్రైలర్ కు ఈజీగా కనెక్ట్ అయిపోతారు. ట్రైలర్ మళయాళంలో ఉన్నా.. కంటెంట్ మాత్రం అర్థమైపోతూ ఉంటుంది.

ఫస్ట్ పార్ట్ లో కేసు నుంచి తప్పించుకున్న జార్ట్ కుట్టి(George kutti)... దృశ్యం 2లో సేఫ్ గా బయటపడతారా..? కేసులో ఇరుక్కుపోతారా..? అనేది తెలియాలంటే ఓ పది రోజులు ఆగాల్సిందే.

Next Story
Share it