Top
Batukamma

కాజల్ పెళ్లితో అనుష్కకు కొత్త సమస్య..! పాపం స్వీటీ..!

కాజల్ పెళ్లితో అనుష్కకు కొత్త సమస్య..! పాపం స్వీటీ..!
X
Highlights

ఇక మోస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ లో అనుష్క ఉండిపోయింది. అప్పట్లో ప్రభాస్ తో ప్రేమ వ్యవహారం అంటూ వార్తలు వచ్చాయి.

Anushka shetty: టాలీవుడ్ లో చాలామంది బ్యూటీలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరెట్ గా ఉన్నారు. ఏజ్ బార్ అవుతున్నా.. చాలామంది బ్యూటీలు పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోతున్నారు. వీరిలో మొన్నటి దాకా కాజల్ అగర్వాల్ ఈ లిస్ట్ లో ఉంది.

రెండు రోజుల క్రితమే కాజల్ కూడా పెళ్లి చేసేసుకుంది. ఇక మోస్ట్ ఎలిజిబుల్ లిస్ట్ లో అనుష్క ఉండిపోయింది. అప్పట్లో ప్రభాస్ తో ప్రేమ వ్యవహారం అంటూ వార్తలు వచ్చాయి. కానీ అఫీషియల్ గా మాత్రం ఎలాంటి ప్రకటన రాలేదు.

ప్రస్తుతానికి ప్రభాస్, కాజల్ ఇద్దరు సింగిల్ గానే ఉన్నారు. అయితే.. కాజల్ కి లెటెస్ట్ గా శుభాకాంక్షలు చెప్పింది అనుష్క. ట్విట్టర్ లో కాజల్ ఫొటో పెట్టి.. ఈ భూమ్మీద అందమైన అనుభవం కానీ.. అనుబంధం కానీ ఉందంటే అది పెళ్లి ఒక్కటే అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. అన్నింటికంటే ఎక్కువ సంతోషాన్ని కలిగించే అంశం కూడా పెళ్లి మాత్రమే అని చెప్పింది.

ఇంత వరకు బాగానే ఉంది. కానీ అనుష్క ఫ్యాన్స్, నెటిజెన్స్ ఊరికే ఉండరు కదా. ఇక అసలు రచ్చ మొదలెట్టేశారు. విషెస్ చెప్పావు సరే.. మరి పెళ్లి సంగతేంటి స్వీటీ..? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.




మరికొందరైతే ఒక్క ఛాన్స్ ఇస్తే గుండెల్లో పెట్టి చూసుకుంటానంటూ.. ప్రభాస్ మీమ్స్ కామెంట్ బాక్స్ లో పెట్టేశారు.

అనుష్క పెళ్లి గురించి ఫ్యాన్స్ ఒకటే.. కామెంట్లు పెడుతున్నా.. ఈ హైట్ అండ్ హాట్ బ్యూటీ(Anushka shetty) మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు. చూడాలి జేజమ్మ ఎప్పుడు పెళ్లి కబురు చెబుతుందో..!

- "క్వశ్చన్ మార్క్" అందాలతో కైపెక్కిస్తున్న అదాశర్మ

Next Story
Share it