Top
Batukamma

తెలుగు సినిమోళ్లు జంగల్ వట్టిన్రు..!

తెలుగు సినిమోళ్లు జంగల్ వట్టిన్రు..!
X
Highlights

ఒకేరకమైన స్టోరీ లైన్ తో ఉండే సినిమాల ట్రెండ్ కొద్ది రోజుల పాటు నడవటం కామన్ అయిపోయింది.

తెలుగు సినిమా అంటే ఓ లవ్ స్టోరీ.. నాలుగు పాటలు.. రెండు ఫైట్లు.. ఇది రెగ్యులర్ గా వస్తున్న ఫార్మాట్. ఓ సోషల్ కాజ్ తో తీసే సినిమాలు తెలుగులో చాలా తక్కువ. లవ్ స్టోరీలు, రొమాంటిక్ మూవీలకే ఫాలోయింగ్ ఎక్కువుంటుంది.

టాలీవుడ్ లో ఒక్కోసారి.. ఒక్కో ట్రెండె నడుస్తూ ఉంటుంది. ఓ టైపు సినిమాలన్నీ ఒకే సమయంలో వస్తుంటాయి. అది లవ్ స్టోరీలు కావచ్చు.. మాఫియా నేపథ్యంతో నడిచే సినిమాలు కావచ్చు. ఒకేరకమైన స్టోరీ లైన్ తో ఉండే సినిమాల ట్రెండ్ కొద్ది రోజుల పాటు నడవటం కామన్ అయిపోయింది.

హీరో పోలీస్ ఆఫీసర్ గా ఉన్న సినిమాలన్నీ వరుసగా వస్తుంటాయి. ఆ తర్వాత హీరో ఫ్యామిలీ మెన్ అయిపోతాడు. కొద్ది రోజుల పాటు అలాంటి సినిమాలే వస్తుంటాయి.

ఇప్పుడు మళ్లీ అలాంటి ట్రెండే మొదలైంది. ఇప్పుడు హీరోలంతా అడవుల బాట పడుతున్నారు. అది ప్రకృతిపై ప్రేమో.. మరొకటో అనుకుంటే పొరపాటే. అందులో వాళ్ల కమర్షియల్ యాంగిల్స్ వాళ్లకుంటాయి.

ఏది ఏమైనాన ఇప్పుడంతా మళ్లీ అడవుల మీద పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు ఫారెస్ట్ బేస్డ్ గా సినిమాలు తీస్తున్నారు.

ఆల్రెడీ రిలీజైన అరణ్య, రిలీజ్ కు రెడీ అయిన ఆచార్య, విరాటపర్యం, పుష్ప.. ఇవన్నీ ఫారెస్ట్ బేస్డ్ గా నడిచే సినిమాలే. అయితే.. విరాటపర్వం సినిమా మాత్రం మావోయిస్టు ఉధ్యమాల నేపథ్యంతో వస్తోంది.

ఆచార్య కూడా మావోయిస్టు నేపథ్యంతోనే వస్తున్నా.. అందులో చాలా వరకు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నట్టు కనిపిస్తోంది.

పుష్ప సినిమా... ఎర్ర చందనం స్మగ్లింగ్ కు సంబంధించిన కథాంశంతో వస్తున్నట్టుగా కనిపిస్తోంది. టీజర్ లో ఎర్రచందనం దుంగలు, ఫారెస్ట్ బ్యాగ్రౌండ్ కనిపించడం దీనికి బలాన్నిస్తోంది.

ఇవే కాదు.. రాబోయే మరికొన్ని సినిమాలు కూడా అడవుల బాట పడతాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా తీసేవాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయడంలో మాత్రం విఫలమవుతూనే ఉన్నారు. చాలా సినిమాల విషయంలో ఫ్యాన్స్ ఇలా డిసప్పాయింట్ అయ్యారు.

దీంతో ఇప్పుడు జనం మధ్య జరుగుతున్న సంఘటనలకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ప్రజలందరికీ తెలిసిన అంశమే కావడంతో.. దాన్ని ఎలా తెరకెక్కించారనే ఆసక్తి వారిలో ఉంటుంది. కాబట్టి.. ఈ విధంగానైనా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇప్పుడు అందరూ అడవుల బాట పట్టడం కూడా అందులో భాగమేననే మాట వినిపిస్తోంది.

- Allu arjuns Pushpa Teaser :పుష్ప టీజర్

- నిరసనలు.. గాడిదగుడ్డులేం లేవు.. విజయ్ సైకిల్ అసలు కథ ఇదే..!!

- రష్మీ నుంచి సుడిగాలి సుధీర్ వరకు జబర్దస్త్ కమెడియన్స్ రెమ్యునరేషన్స్ ఇవే.. !

- ప్రగతి ఆంటీ వర్కౌట్ చూస్తే ఫిదా కావాల్సిందే..!

Next Story
Share it