కొట్టినా.. పెట్టినా మా బాలయ్యే.. నువ్వే రియల్ హీరో!

భారీ వర్షాల వలన హైదరాబాదు అతలాకుతలం అయింది. దీనితో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో తిండీతిప్పాలు లేకా జనాలు అవస్థలు పడుతున్నారు.
భారీ వర్షాల వలన హైదరాబాదు అతలాకుతలం అయింది. దీనితో ఇళ్లలోకి భారీగా వరద నీరు వచ్చింది. ఈ క్రమంలో తిండీతిప్పాలు లేకా జనాలు అవస్థలు పడుతున్నారు. మరికొందరు నివాసాలు కోల్పోయి పునరావాస కేంద్రాల్లో గడుపుతున్నారు. అటు వర్షాలు వలన సుమారుగా 50 మంది మృతి చెందగా, ఇంకా మృతదేహాలు బయటపడాల్సి ఉంది.
అయితే వరద బాధితులను ఆదుకోవడం కోసం సినీ పరిశ్రమ నుంచి ఒక్కరు కూడా ముందుకు రావడం లేదు. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ రూ. 1.5 కోట్ల విరాళం ప్రకటించారని తెలుస్తోంది. ఈ మేరకు బాలయ్య విరాళం ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే జరుగుతోంది. అయితే దీనిపైన బాలకానీ.. తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.
హైదరాబాద్ వరద బాధితులకు కోటి 50 లక్షలు విరాళం ప్రకటించిన నందమూరి బాలకృష్ణ.#HyderabadFloods #Balakrishna #Tollywood #NBK #jaibalayya #KomaramBheemNTR #RamarajuforBheemOnOct22 pic.twitter.com/SkzXp1h2E2
— Azeem lovely (@Azeemlovely1) October 18, 2020
కానీ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో మాత్రం బాగానే ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా బసవ తారకరామ సేవా సమితి ద్వారా పాతబస్తీలోని 1000 కుటుంబాలకు ఆహార పొట్లాలను కూడా అందజేస్తున్నారని చెబుతున్నారు. ఈ ఆహార పోట్లలను ఈ రోజు సాయింత్రం వారికి అందించానున్నారట..
Kashtam ani vinapadithe chalu, aagakunda help chesthadu maa balayya babu!🙏❤#nandamuribalakrishna #balayyababu #balakrishna #Nandamuri pic.twitter.com/IVYuXupSUe
— Ismart Naveen (@IsmartNaveen77) October 18, 2020
అటు కరోనా సమయంలో బాలకృష్ణ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటుగా పేద సినీ కార్మికుల కోసం రూ1.25 కోట్లు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే..
హైదరాబాద్ వరదభాదితులకు 1కోటి 50లక్షల విరాళం ప్రకటించిన హిందూపురం ఎమ్మెల్యే, నటసింహం Nandamuri Balakrishna గారు..🙏#NandamuriBalakrishna #TDPTwitter #Amanwithgoldenheart#saveforlife #hyderabadheavyrains pic.twitter.com/NU2RFHaM2H
— Rakesh Koniki (@RakeshKoniki4) October 18, 2020
హైదరాబాదు వరద బాదితులకి తమ అభిమాన హీరో కోటి యాబై లక్షల విరాళం ఇవ్వడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. కొట్టిన పెట్టిన మా బాలయ్యే.. నువ్వే రియల్ హీరో అంటూ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.