Top
Batukamma

సామాన్యుడిలా మెట్రోలో పవన్

సామాన్యుడిలా మెట్రోలో పవన్
X

Pawan kalyan In Metro 

Highlights

ఆ రైతుతో పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటివల కురిసిన వర్షాల వల్ల వ్యవసాయం బాగా దెబ్బతిందని సదరు రైతు పవన్ కి చెప్పుకొచ్చాడు..

జనసేన చీఫ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురువారం మెట్రో రైల్లో ప్రయాణించారు.. ఓ సామాన్యుడిలా పవన్ మెట్రోలో ప్రయాణం చేయడం విశేషం.. వకీల్‌సాబ్‌ షూటింగ్‌ కోసం పవన్ మెట్రోలో ప్రయాణం చేశారు.

సాధారణ ప్రయాణికుడిలా మెట్రోస్టేషన్‌లో చెకింగ్‌ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పవన్ పాటించారు. మాదాపూర్‌ నుంచి మియాపూర్‌ వరకు మెట్రోలో ప్రయాణించిన పవన్ అమీర్ పేట స్టేషన్‌లో ట్రైన్ మారారు. ఇక ఈ ప్రయాణంలో పవన్ తన పక్కన ఉన్న ద్రాక్షరామం రైతు సత్యనారాయణతో కాసేపు ముచ్చటించారు.


ఆ రైతుతో పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇటివల కురిసిన వర్షాల వల్ల వ్యవసాయం బాగా దెబ్బతిందని సదరు రైతు పవన్ కి చెప్పుకొచ్చాడు.. ఈ మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతుచెప్పగా, తనకు కూడా కొత్తేనని పవన్ నవ్వుతూ చెప్పుకొచ్చారు.



ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో పవన్ వెంట చిత్ర నిర్మాత దిల్ రాజు కూడా ఉన్నారు.. కరోనా వలన వాయిదా పడిన వకీల్ సాబ్ చిత్రం ఇటివల మొదలవ్వగా పవన్ షూటింగ్ లో పాల్గొన్నారు.



ఇక వకీల్ సాబ్ విషయానికి వచ్చేసరికి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దిల్ రాజు మరియు బోనీ కపూర్ కలిసి నిర్మిస్తున్నారు. బాలీవుడ్ లో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ కాగా ఇందులో పవన్ లాయర్ గా కనిపించనున్నాడు.

Next Story
Share it