Top
Batukamma

అన్నా.. అన్నా.. అంటూనే రోమాన్స్ చేసిన రోజా!

అన్నా.. అన్నా.. అంటూనే రోమాన్స్ చేసిన రోజా!
X
Highlights

రోజా తానూ కలిసి క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ మొదలగు సినిమాల్లో నటించామని, ఐతే తను నన్ను ఎప్పుడు అన్నా అన్నా అని పిలిచేదని శ్రీకాంత్ వెల్లడించాడు..

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్, రాశి హీరోహీరోయిన్స్ గా వచ్చిన ప్రేయసి రావే చిత్రం ఎంత పెద్ద హిట్టైందో అందరికి తెలిసిందే.. సురేష్ ప్రొడక్షన్స్ పై డి రామానాయుడు ఈ సినిమాని నిర్మించగా, చంద్రమహేష్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు.

1999 లో వచ్చిన ఈ చిత్రం తాజాగా 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు హీరో శ్రీకాంత్.. ఈ సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పోసాని డైలాగ్స్, శ్రీలేఖ మ్యూజిక్ సినిమాకి చాలా ప్లస్ అయ్యాయని, అయితే సినిమా క్రెడిట్ మొత్తం రామానాయుడుకే దక్కుతుందని అన్నారు శ్రీకాంత్.

ఇక ఇదే ఇంటర్వ్యూలో తనతో కలిసి నటించిన సౌందర్య, మీనా, రమ్యకృష్ణ, రోజాల గురించి కూడా శ్రీకాంత్ మాట్లాడారు. రోజా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ.. రోజా తానూ కలిసి క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశ మొదలగు సినిమాల్లో నటించామని, ఐతే తను నన్ను ఎప్పుడు అన్నా అన్నా అని పిలిచేదని శ్రీకాంత్ వెల్లడించాడు..

ఇక సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రొమాంటిక్ సాంగ్స్, రొమాంటిక్ సీన్స్ చేసే ముందు అన్నా ఈ సీన్ అలా చేద్దాం.. అన్నా ఈ సీన్ ఇలా చేద్దాం అంటూ రోజా చెప్పేదని, అప్పుడు చిరాకు లేచి హే ఆపు.. కాసేపు అయినా అన్నా అని పిలవడం ఆపేయి అనే వాడినని శ్రీకాంత్ తెలిపాడు.

అలాంటి సన్నివేశాల్లో నువ్వు అన్నా అని పిలిస్తే ఆ ఫీల్ రావడం లేదని అనేవాడినని శ్రీకాంత్ చెప్పుకొచ్చాడు. ఇద్దరం చాలా విషయాల్లో చాలా సరదాగా ఉండేవాళ్లమని, రోజా మంచి నటి అంటూ చెప్పుకొచ్చారు శ్రీకాంత్.



Next Story
Share it