Top
Batukamma

తాగి ఊగిన కాజల్.. నెటిజన్లు దుమ్ముదులిపారు!

తాగి ఊగిన కాజల్.. నెటిజన్లు దుమ్ముదులిపారు!
X
Highlights

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కి వెళ్లి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ బిజినెస్ మెన్ గౌతమ్ కిచ్లును ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట హనీమూన్ కి వెళ్లి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. కాజల్ తన భర్తతో దిగిన ఫోటోలతో పాటుగా బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రచ్చరచ్చ చేస్తోంది.

అయితే హనీమూన్ లో భాగంగా తాజాగా కాజల్ తన సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని ఫోటోలు వీపరితంగా వైరల్ అవుతున్నాయి. తన భర్తతో కలిసి మందు తాగుతూ ఓ స్టిల్ కి ఫోజులిచ్చింది కాజల్. ఈ ఫోటోలను చూస్తుంటే మొత్తానికి అక్కడ ఇద్దరు కలిసి పార్టీలో బాగా ఎంజాయ్ చేశారని అర్ధం అవుతుంది.

అయితే ఇంకా ఇంకో ఫోటోలో మాత్రం కాజల్ పెద్ద రచ్చే చేసింది. ఫుల్ గా తాగి తన భర్త వీపుపై ఎక్కి నానా హంగామా చేసింది. ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు కాజల్ ను కామెంట్ల రూపంలో ఆడుకుంటున్నారు. ఇలా తప్ప తాగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సభ్యసమాజానికి ఎం మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నావ్ అంటూ క్లాస్ పీకుతున్నారు.

దాదాపుగా పది రోజులకు గాను ఈ జంట 5 కోట్లను ఖర్చు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక పెళ్లి తరవాత కూడా తానూ నటిస్తానని ఇప్పటికే కాజల్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉంది కాజల్.. ఆచార్య, భారతీయుడు, మోసగాళ్ళు అనే సినిమాల్లో నటిస్తోంది.

Next Story
Share it