Top
Batukamma

ఈ కోమలి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!

ఈ కోమలి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు..!
X
Highlights

ఈ చిన్నారి ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ లు కూడా వస్తున్నాయట.

కోమలి సిస్టర్స్.. చాలామందికి సుపరిచితమైన పేరు ఇది. అతిచిన్న వయసులోనే టీవీషోలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు ఇద్దరు అక్కాచెల్లెళ్లు. న్యూస్ తో పాటు.. ఎంటర్ టైన్ మెంట్ ఛానళ్లలోనూ తమ ప్రతిభ నిరూపించుకున్నారు.

కోమలి సిస్టర్స్ లో పెద్దమ్మాయి హిరోషిణి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంచులక్ష్మి మిమిక్రితో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఏకంగా హీరోయిన్ ఛాన్స్ లు కూడా వస్తున్నాయట.

- శ్రీదేవి కూతురితో రాఘవేంద్రరావు పెళ్లి సందడి..!

- ఆన్ లైన్ లో హాట్ టాపిక్ అయిన త్రిదా చౌదరి..!

- ఛీ..ఛీ.. రాష్ట్రంలో బీజేపీ మరీ ఇంత దిగజారిందా?


కోమలి సిస్టర్స్ ది ఖమ్మం. వీరి చిన్నతనంలోనే ఫ్యామిలీ హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. హిరోషిణి తండ్రి పాలిటిక్స్ లో తిరిగే వారు. తండ్రి టీవీలో కనిపించడం కూడా.. తాము టీవీలో కనిపించాలని మిమిక్రి నేర్చుకున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఇమిటేట్ చేసి ఆందరిని ఆకట్టుకున్నారు.


మిమిక్రి క్రమంగా వీరికి ఫేమ్ పెరిగిపోయింది. ఏకంగా టీవీ9లో నవ్వులాట ప్రోగ్రాం చేసేశారు. దీంతో క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. సినిమాల్లోనూ అవకాశాలు రావడం మొదలిం.

చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ లో నటించింది ఈ చిన్నారి ముద్దుగుమ్మ. హిరోషిణి నటనకు మెచ్చి ఏకంగా ఎన్టీఆర్ కూతురి పాత్రకు సెలెక్ట్ చేసుకున్నాడు డైరెక్టర్ క్రిష్. తర్వాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ కూడా ఛాన్స్ వచ్చిందట.


తెలుగులోనే కాదు.. ఇతర భాషల్లో షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసింది హిరోషిణి. తన అందంతో మాటకారితనంతో ప్రేక్షకులను సంపాదించుకుంటోంది.

ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు.. నటనపై తనకున్న కోరికను తీర్చుకుంటోంది. ఒక్క యాక్టింగే కాదు.. మిమిక్రి, సంగీతం, డ్యాన్స్.. అన్నింటిలోనూ మంచి పట్టు సాధించింది హిరోషిణి. ఈ బ్యూటీ వేసే యోగాసనాలకు ఫిదా కావాల్సిందే.






















































Next Story
Share it