Top
Batukamma

INOX :ఐనాక్స్ బంపర్ ఆఫర్.. థియేటర్ మొత్తం మీదే..!

INOX :ఐనాక్స్ బంపర్ ఆఫర్.. థియేటర్ మొత్తం మీదే..!
X
Highlights

ఒకట్రెండు సినిమాలు వచ్చినా.. అవి OTTలో రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్లకు నష్టాలు తప్పడం లేదు.

Inox : కరోనా దెబ్బతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. ఇటీవలే థియేటర్లు ఓపెన్ చేసేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. 50 కెపాసిటీతో, కరోనా నిబంధనలన్నీ పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసేందుకు పర్మీషన్ ఇచ్చింది.

అయినా ప్రజలు మాత్రం థియేటర్లకు రావడం లేదు. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని చెబుతున్నా.. జనం మాత్రం థియేటర్ల వైపు రావడం లేదు. దీనికి తోడు కొత్తగా భారీ సినిమాలేవీ రిలీజ్ కాలేదు. ఒకట్రెండు సినిమాలు వచ్చినా.. అవి OTTలో రిలీజ్ అయ్యాయి. దీంతో థియేటర్లకు నష్టాలు తప్పడం లేదు.

అయితే.. ఈ నష్టాల నుంచి గట్టెక్కేందుకు ఐనాక్స్ గ్రూప్ ఓ బంపరాఫర్ ప్రకటించింది. ప్రేక్షకులు థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. కేవలం 2999 రూపాయలకే థియేటర్ మొత్తం బుక్ చేసుకోవచ్చని చెబుతోంది.

అయితే.. థియేటర్ లో 50 శాతం సీట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. దీనికి మరో కండీషన్ కూడా పెట్టింది ఐనాక్స్(INOX). ఓ వ్యక్తి కుటుంబం, స్నేహితులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని చెప్పింది. ఇందులో మరో బంపరాఫర్ కూడా ఉంది. ప్రేక్షకులు తమకు నచ్చిన సినిమా, నచ్చిన టైంలో చూసే సదుపాయం కూడా కల్పించింది.

థియేటర్ బుక్ చేసుకోవాలనుకున్న వారు tickets@inoxmovies.comకి మెయిల్ చేయాలని ప్రకటించింది ఐనాక్స్.

Next Story
Share it