Top
Batukamma

HBD Rajasekhar : ఈ సినిమాలు రాజశేఖర్ చేసుంటే మరో మెగాస్టార్ అయ్యేవాడు!

HBD Rajasekhar : ఈ సినిమాలు రాజశేఖర్ చేసుంటే మరో మెగాస్టార్ అయ్యేవాడు!
X
Highlights

అయితే అటు హీరోగా, ఇటు విలన్ గా రాజశేఖర్ చాలా సినిమాలను మిస్ చేసుకున్నారు. ఇందులో కొన్ని అయనే మిస్ చేసుకోగా మరికొన్ని సినిమాలు చివరి నిమిషంలో వేరేవాళ్ళకి వెళ్ళాయి. ఆ లిస్టు ఇప్పుడు చూద్దాం!

మనం తినే మెతుకు మీదా మన పేరు రాసుండాలని అంటారు. అలాగే చేసే సినిమా పైన కూడా పలనా హీరో పేరు రాసుండాలి.. ఎవరినో అనుకోని... మరొకరిని ఫిక్స్ చేసి.. వేరేవాళ్ళతో సినిమాలు చేసిన సందర్భాలు అయితే ఇండస్ట్రీలో అయితే కోకొల్లలనే చెప్పాలి.

యాంగ్రీ యంగ్ మెన్‌గా ఇండస్ట్రీలో తనదైన ముద్రవేసుకున్న హీరో రాజశేఖర్ చాలా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. అయితే గత కొన్నేళ్లుగా హీరోగా సక్సెస్‌ లేకా ఇబ్బంది పడుతున్నారు రాజశేఖర్.. ఈ క్రమంలో విలన్ గా చేసేందుకు కూడా తానూ సిద్దేమేనని ఆ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చారు.

అయితే అటు హీరోగా, ఇటు విలన్ గా రాజశేఖర్ చాలా సినిమాలను మిస్ చేసుకున్నారు. ఇందులో కొన్ని అయనే మిస్ చేసుకోగా మరికొన్ని సినిమాలు చివరి నిమిషంలో వేరేవాళ్ళకి వెళ్ళాయి. ఆ లిస్టు ఇప్పుడు చూద్దాం!

రామ్ చరణ్ 'థృవ' సినిమాలో లో అరవింద్ స్వామి పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. కానీ ఒరిజినల్ సినిమాలో అరవింద్ స్వామి ఒక్కడే ఉన్న చాలా సీన్స్‌‌ ఉన్నాయి. మళ్ళీ షూట్ చేయడం ఎందుకని తెలుగులో కూడా అరవింద్ స్వామినే తీసుకున్నారు.

చిరంజీవి 'స్నేహం కోసం'లో కూడా ముందుగా విజయ్ కుమార్ చేసిన పాత్రను రాజశేఖర్‌ను అనుకున్నారట. కానీ యంగ్ గా ఉన్న రాజశేఖర్ ఆ క్యారెక్టర్‌కు సూట్ కారని చిరు చెప్పడంతో ఆ పాత్ర విజయ్ కుమార్ చేశారు.

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ను రాజశేఖర్ ను అనుకున్నారట.. కానీ ఆ పాత్ర ఫైనల్ గా ప్రకాష్ రాజ్ చేశారు.

శంకర్ తెరకెక్కించిన జెంటిల్ మెన్, ఒకే ఒక్కడు సినిమాలను ముందుగా రాజశేఖర్ తోనే తీయాలని అనుకున్నారు. కథలు కూడా రాజశేఖర్ కూడా బాగా నచ్చాయి. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాక ఈ సినిమాలను వదిలేశారు.

చిరంజీవి 'ఠాగూర్' సినిమాను ముందు రాజశేఖర్ రీమేక్ చేయాలనకున్నారు. కానీ అది చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. దీంతో అప్పటినుంచి చిరు, రాజశేఖర్ మధ్య విబేధాలు మొదలయ్యాయి.

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఉపేంద్ర పాత్ర కోసం ముందుగా రాజశేఖర్‌ను అనుకున్నారట. కానీ ఏమైందో కానీ ఆ పాత్రను ఉపేంద్ర చేశారు.

Next Story
Share it