Top
Batukamma

'కలర్ ఫోటో' పోరి గురించి ఖతర్నాక్ విషయాలు!

కలర్ ఫోటో పోరి గురించి ఖతర్నాక్ విషయాలు!
X
Highlights

సినిమాల్లో ఎవరికీ ఎప్పుడు బ్రేక్ వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి సినిమా మొత్తం కనిపించినా పేరు రాకపోవచ్చు. మరోకొందరికి సింగిల్ డైలాగ్ తోనే పేరు రావచ్చు. ఇలా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

సినిమాల్లో ఎవరికీ ఎప్పుడు బ్రేక్ వస్తుందో ఎవరికీ తెలియదు. ఒక్కోసారి సినిమా మొత్తం కనిపించినా పేరు రాకపోవచ్చు. మరోకొందరికి సింగిల్ డైలాగ్ తోనే పేరు రావచ్చు. ఇలా ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారు.

ఇక ఇదిలా ఉంటే ఓటీటీ పుణ్యమా అని ఓ నాచురల్ నటి తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయింది నటి దివ్య శ్రీపాద.. ఓటీటీలో రిలీజైన కలర్ ఫోటో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. సినిమాలో హీరో సుహాస్, హీరోయిన్ చాందినీ చౌదరీకి ఎంత పెద్ద పేరు వచ్చిందో దివ్య శ్రీపాదకి కూడా అంతే పేరు వచ్చింది.

చాలా సహజంగా నటించి అందరి ప్రశంసలు అందుకుంది ఈ బ్యూటి. ఈ సినిమానే కాదు.. ఓటీటీలోనే వచ్చిన మరో మూవీ మిడిల్ క్లాస్ మేలోడిస్ సినిమాలో కూడా గౌతమి అనే పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది. దీనితో ఇప్పుడు ఈ దివ్య శ్రీపాద పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. ఇంతకీ ఎవరీ దివ్య శ్రీపాద అనే చర్చ మొదలైంది.



* దివ్య శ్రీపాద సినిమాలకి కొత్త కానీ నటనకి కాదు. సినిమాల్లోకి రాకముందు ఛాయ్ బిస్కెట్, గర్ల్స్ ఫార్ములాస్ లాంటి షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.

* దివ్యకి జంతువులంటే చాలా అంటే ఇష్టం.. అందుకే 2014 నుంచి హైదరాబాదు బ్లూ క్రాస్ లో వాలేంటిర్ గా పనిచేస్తోంది.

*దివ్య తండ్రి శ్రీనివాస్, తల్లి సుధారాణి, దివ్యకి ఓ చెల్లి కూడా ఉంది. ఆమె పేరు దీప్తి

*దివ్య చదువంతా హైదరాబాదులోనే సాగింది. చిన్నప్పటినుండి నటన పైన ఆసక్తి ఉండడంతో ఎక్కడ కూడా ఎక్కువ రోజులు జాబ్ చేయలేకపోయింది.


* ఆ తర్వాత ఛాయ్ బిస్కెట్ కి ఆడిషన్స్ కి వెళ్లి అక్కడ సెలెక్ట్ అయింది.

*దివ్య మంచి నటి మాత్రమే కాదు.. మంచి రచయిత కూడా.. గర్ల్స్ ఫార్ములాస్ కి ఎక్కువగా స్టోరీస్ అందించింది దివ్య..

* షార్ట్ ఫిలిమ్స్ నుంచి మెల్లిమెల్లిగా సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ వచ్చింది. ముందుగా విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలో ఓ చిన్న పాత్ర చేసింది.

*ఇక ఆ తర్వాత మిస్ ఇండియా సినిమాలో కీర్తి సురేష్ కి ఫ్రెండ్ గా నటించింది. ఆ తర్వాత కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మేలోడిస్ సినిమాలలో నటించింది.


ఈ మూడు సినిమాలకి మంచి పేరు రావడంతో దివ్య శ్రీపాదకి ఎక్కడలేని ఫేం వచ్చింది. అసలే తెలుగమ్మాయిలకి ఇండస్ట్రీలో అవకాశాలే రావు అనుకుంటున్న తరుణంలో మంచి మంచి పాత్రలను ఎంచుకొని వరుస విజయాలతో ముందుకు వెళ్ళడం అనేది మామలు విషయం కాదు.. ఇలాగే మంచి మంచి పాత్రలతో ప్రేక్షకులను దివ్య శ్రీపాద మరింతగా మెప్పించాలాని మనము కోరుకుందాం!

Next Story
Share it