అవును నాకు తాగే అలవాటుంది.. నా పొట్టను చూసి గర్వంగా ఫీల్ అవుతా.. : అనసూయ

బుల్లితెర పైన సక్సెస్ఫుల్ గా యాంకరింగ్ చేస్తూనే.. వెండితెర పైన సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది.
ఎవరు ఎన్ని చెప్పిన తనకి నచ్చిన దారిలోనే వెళ్తుంది జబర్దస్త్ యాంకర్ అనసూయ.. బుల్లితెర పైన సక్సెస్ఫుల్ గా యాంకరింగ్ చేస్తూనే.. వెండితెర పైన సెలెక్టివ్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇదిలా ఉంటే... తాజాగా ఐడ్రీం ఛానల్ స్వప్నకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది అనసూయ.
పవన్ కళ్యాణ్ సినిమా అత్తారింటికి దారేది సినిమాలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ..' పాట కోసం దర్శకనిర్మాతలు అనసూయను సంప్రదించారట. అయితే ఆ పాటలో చేయలంటే ఇంకెవరు కనిపించకూడదని కండీషన్ పెట్టిందట అనసూయ.. దానికి దర్శకనిర్మాతలు ఒప్పుకోలేదట.. అయితే ఈ న్యూస్ బయటకు వెళ్ళడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నువ్వేంటి.. పవన్ కల్యాణ్ కాలి గోటికి కూడా సరిపోవు అంటూ సోషల్ మీడియాలో వీపరితంగా ట్రోల్ చేశారు. దీనితో తనని అవమానించారని ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా వెనక్కు ఇచ్చేశానని అనసూయ చెప్పుకొచ్చింది.
ఇక ఒకప్పుడు అయితే ఆ పిల్లకు పెళ్లైంది, పనికిరాదు అనేట్లుగా మాట్లాడేవారని, కానీ నేను బల్లగుద్ది చెప్పగలను. వాళ్లకంటే కంటే నేను బాగా నటిస్తానని అంది అనసూయ. ఇక తనకి తాగే అలవాటుందని, ఒక రోజైతే అర్ధరాత్రి 2 గంటలకు తాగేసి ఉన్నానని చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే ఇదంతా నీకవసరమా ఆంటీ, ఇద్దరు పిల్లలను చూసుకో అని చెప్తుంటారు.
అదేదో వాళ్లే నా పిల్లకు ఫుడ్ పెడుతూ, ఫీజు కడుతున్నట్లు మాట్లాడుతుంటారు. కెమరా ముందు అందంగా ఉండాల్సిందే. లేదంటే ఆంటీ అంటూ హేళన చేస్తారు. నిజంగా నా పొట్టను చూసి నేను గర్వంగా ఫీల్ అవుతా..అందుకే నా కొడుకు అందులో కంఫర్టబుల్‌గా ఉండగలిగాడని చెప్పుకొచ్చింది అనసూయ.