Top
Batukamma

BJP లోకి అనసూయ.. మేలో పొలిటికల్ ఎంట్రీ.. !

BJP లోకి అనసూయ.. మేలో పొలిటికల్ ఎంట్రీ.. !
X
Highlights

సినీ స్టార్స్ రాజకీయాల్లోకి రావడం అనేది కొత్తేమి కాదు.. అదేమి పెద్ద వింత కూడా కాదు.. ఇక జబర్ధస్త్ కామెడీ షోతో మోస్ట్ పాపులర్ అయిన యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రానుందని తెలుస్తోంది.

గతంలో కూడా ఆమె రాజకీయాల్లో వస్తుందంటూ న్యూస్ వచ్చినప్పటికీ.. వాటిపైన ఆమె పెద్దగా స్పందించలేదు. ఇప్పటికే ఆమెకి టీఆర్ఎస్, బీజేపీ నుంచి ఆఫర్స్ కూడా వచ్చాయని, కానీ ఆమె వాటిని అప్పుడు సున్నితంగా తిరస్కరించారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడే రాజకీయాలు వద్దని ఆమె తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించగా, పొలిటకల్ ఎంట్రీకి ఇదే సరైన సమయం అంటూ ఆమెను రాజకీయల దిశగా ప్రోత్సహిస్తున్నట్టుగా సమాచారం. అయితే ఆమె రాజకీయాల్లోకి వెళ్ళినప్పటికి షోలు, సినిమాలు చేసేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. అధికార వైసీపీలో కీలక నేతగా ఎదిగిన రోజా.. ప్రస్తుతం అదే జబర్ధస్త్‌ షోను చేసుకుంటుంది. రోజా బాటలోనే అనసూయ కూడా త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.

అనసూయ జాతక రిత్యా ఆమె పొలిటికల్ ఎంట్రీ మేలో ఉండే అవకాశం ఉండనుందని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఆమె తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఫార్మ్ లోకి వస్తున్న బీజేపీలో ఆమె చేరనున్నట్టుగా సమాచారం. చూడాలి మరి ఏం జరుగుతుందో!

Next Story
Share it