అందంతో పిచ్చెక్కిస్తున్న ఈ 'జబర్దస్త్' పిల్ల ఎవరో తెలుసా?

Jabardasth Varsha
Jabardasth Varsha: జబర్దస్త్ .. ఈ షో చాలా మందికి లెఫ్ ని ఇచ్చింది.. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు కూడా వెలుగులోకి వచ్చారు.. ఏకంగా కొందరు అయితే హీరోలు కూడా అయిపోయారు..
Jabardasth Varsha: జబర్దస్త్ .. ఈ షో చాలా మందికి లెఫ్ ని ఇచ్చింది.. ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్లు కూడా వెలుగులోకి వచ్చారు.. ఏకంగా కొందరు అయితే హీరోలు కూడా అయిపోయారు.. అయితే ఈ షోలో అమ్మాయిలకు మొన్నటివరకు పెద్దగా ప్లేస్ లేదనే చెప్పాలి.. ఎందుకంటే స్కిట్ల మధ్యలో కొట్టుకోవడం , తిట్టుకోవడం లాంటివి ఉంటాయి కాబట్టి మగవాళ్లే లేడీస్ గెటప్‌లో వచ్చి చేసేవారు..
ఇక ఎక్కువగా లేడీస్ పైన స్కిట్లు చేసే చమ్మక్ చంద్ర ఆమధ్య సత్య అనే ఒక అమ్మాయిని తీసుకొచ్చి కంటిన్యూగా స్కిట్లు చేశాడు.. జబర్దస్త్ వీడిన తర్వాత కూడా చమ్మక్ చంద్ర అదిరింది షోలో కూడా సత్యని కంటిన్యూ చేస్తున్నాడు.. చంద్రను చూసి మిగతా టీమ్ లీడర్స్ కూడా స్కిట్ లలో అమ్మాయిలను తీసుకురావడం స్టార్ట్ చేశారు.
అయితే గత కొద్ది రోజుల నుంచి హైపర్ ఆది స్కిట్ లో ఒక అమ్మాయి వరుసగా స్కిట్ లు చేస్తూ వస్తోంది.. గత వారం బ్లూ శారీలో బైక్ పైన వచ్చి అందరినీ ఆకట్టుకుంది.. ఆమె వాయిస్ కూడా చాలా హస్కీ గా ఉండడంతో ప్రేక్షకులు ఆ అమ్మాయి ఎవరా అని ఆరా తీయడం మొదలు పెట్టారు . ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో కాదు.. ఆ అమ్మాయి పేరు వర్ష.(Jabardasth Varsha)
ఇప్పటికే తెలుగు సీరియల్ లో నటించింది కూడా... ఈ టీవీలో వచ్చే తూర్పు పడమర, అభిషేకం, ప్రేమ ఎంత మధురం మొదలగు సీరియల్ నటించింది కానీ పెద్దగా క్లిక్ కాలేదు.. జబర్దస్త్ లోకి వచ్చి హైపర్ ఆది స్కిట్ లో చేసి అందరి మతి పోగొడుతుంది.. ముఖ్యంగా ఆ నడుమును చూపించి, చూపించకుండా చంపేసింది.
అబ్బా ఎవర్రా ఈ పిల్ల అందంతో చంపేస్తుందని నెటిజన్లు అనుకుంటున్నారు.. ఏది ఏమైనా జబర్దస్త్ లోకి వచ్చిన తర్వాత వర్షకి మామూలు పాపులారిటీ రాలేదు.. మరి ఈ పాపులారిటీని వర్ష ఎలా వాడుకుంటుందో చూడాలి మరి.