Top
Batukamma

బావా.. బావా.. అంటూ జబర్దస్త్ బాక్స్ బద్దలుకొట్టింది..!

బావా.. బావా.. అంటూ జబర్దస్త్ బాక్స్ బద్దలుకొట్టింది..!
X
Highlights

తాజాగా రాకేష్ స్కిట్ లో చేసిన ఓ స్కిట్ బీభత్సంగా పేలింది. దీనికి కారణం కూడా వర్షానే.

Jabardasth varsha: జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో.. మొదట్లో టైటిల్ తగ్గట్టుగానే స్కీట్లు ఉండేవి.. స్కీట్ల మధ్యలో కొట్టుకోవడం,తన్నుకోవడం కూడా ఉంటుంది కాబట్టి మగవాళ్ళే లేడీస్ గెటప్ లో వచ్చి చేసేవారు.. అప్పుడు స్కిట్ లపైనే షో బాగా క్లిక్ అయింది కూడా.. అయితే రానురాను స్కిట్ లలో పస ఉండడం లేదు. దీంతో ఇప్పుడు షోకి కాస్తా గ్లామర్ హంగులు అద్దుతున్నారు నిర్వాహకులు.

ఆ మధ్య చమ్మక్ చంద్ర సత్యశ్రీని పట్టుకొచ్చి షోలో లేడీస్ కూడా చేసే స్పేస్ ఇచ్చాడు. ఆ తరవాత మిగతా టీమ్ లీడర్స్ కూడా లేడీస్ కి తమ స్కిట్ లలో రోల్స్ ఇస్తున్నారు. అలాగే వచ్చి బాగా క్లిక్ అయింది వర్ష. ఎప్పుడూ ఏదో స్కిట్లో అమ్మాయిలను పట్టుకొచ్చే హైపర్ ఆది.. కొన్ని రోజుల క్రితం వర్షను పట్టుకొచ్చాడు. అంతకుముందు సీరియల్స్ లో కూడా నటించింది ఈ వర్ష..

ఇక జబర్దస్త్ లోకి వచ్చి ఓ రెండు స్కిట్ లు చేసి బాగా క్లిక్ అయింది వర్ష. తాజాగా రాకేష్ స్కిట్ లో చేసిన ఓ స్కిట్ బీభత్సంగా పేలింది. దీనికి కారణం కూడా వర్షనే. ఈ స్కీట్లో బావ.. బావ ..అంటూ ఆ నడుమును చూపించి చూపించకుండా మెలికలు తిరుగుతూ రెచ్చిపోయింది వర్ష. ఇంకేముంది ప్రోమో తోనే దిమ్మతిరిగేలా చేసిన ఈ బ్యూటీ ఫుల్ స్కిట్ కోసం వెయిట్ చేసేలా చేసింది. అలా నిన్న యూట్యూబ్ లో పెట్టారో లేదో ఈ స్కిట్ ను తెగచూసేశారు .


ఏకంగా ఈ స్కిట్ కి రెండు లక్షల ముప్పై వేల కి పైగానే వ్యూస్ వచ్చాయి.. బేసిక్ గా రాకేష్ స్కిట్స్ అంటేనే బోరింగ్. టీవీ లోనే ఎవరు చూడరు.. అలాంటిది ఇంకా యూట్యూబ్ లో ఎవరు చూస్తారనే టాక్ కూడా ఉంది. అలాంటిది మరి యూట్యూబ్ లో ఈ రేంజ్ లో వ్యూస్ వచ్చాయంటే మామూలు విషయం కాదు కదా. మొత్తానికి వర్ష రోజురోజుకు తన క్రేజ్ పెంచుకుంటూ జబర్దస్త్ షోకి బాగా హైప్ పెంచుతోంది.

- Jabardasth Varsha : యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తున్న జబర్దస్త్ పోరి! మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

- చెప్పేది శ్రీరంగ నీతులు.. వేసుకునేవి సగం బట్టలు!

- ఆ సినిమా క్లైమాక్స్ చూసి ఏకంగా 40 మంది ఆత్మహత్య.. క్షమాపణలు కోరిన డైరెక్టర్


Next Story
Share it