Top
Batukamma

ఇంట్లో పెళ్ళిసందడి .. కంగనాకి అత్యాచార బెదిరింపు!

ఇంట్లో పెళ్ళిసందడి .. కంగనాకి అత్యాచార బెదిరింపు!
X
Highlights

దేశవ్యాప్తంగా వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఈ క్రమంలోనే ఆమె పైన పలు కేసులు నమోదు అవుతున్నాయి కూడా..

దేశవ్యాప్తంగా వివాదాస్పద వాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. ఈ క్రమంలోనే ఆమె పైన పలు కేసులు నమోదు అవుతున్నాయి కూడా.. ఇక తాజాగా ఓడిశాకి చెందిన ఓ లాయర్ నుంచి కంగనాకి అత్యాచారం బెదిరింపులు వచ్చాయి. ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలిలో ఉన్న కంగనా దీనిపైన స్పందించలేదు.

అయితే ఆ బెదిరింపు పైన సదరు లాయర్ స్పందించాడు. "ఈ రోజు సాయంత్రం నా ఫేస్‌బుక్ ఐడి హ్యాక్ అయింది. అందులో నుంచి కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలతో ఎవరో పోస్ట్ చేశారు. ఇది చూసి నేను కూడా చాలా షాక్ అయ్యాను. స్త్రీలను గౌరవించడం నాకు తెలుసు.. స్త్రీలను, సమాజాన్ని ఉద్దేశించి నేను ఇటువంటి వ్యాఖ్యలు చేయను" అంటూ వెల్లడించాడు. ఇక అనంతరం తన సోషల్ మీడియా అకౌంట్ ని తోలిగించినట్టుగా తెలిపాడు.

అటు కంగనా తన కుటుంబ సభ్యులతో ప్రస్తుతం బిజీగా ఉంది. ఆమె సోదరుడు అక్షిత్‌ రనౌత్‌ వివాహం త్వరలోనే జరగనుంది.. ఈ సందర్భంగా ఆమె పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్‌, మెహందీ, హల్దీ వేడుకలతో ఆమె ఇల్లంతా సందడి నెలకొంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి..

గతేడాది నవంబరులో అక్షిత్‌ ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.. ఎప్పుడు సీరియస్ గా కనిపించే కంగనా తన సోదరుడు వివాహంలో నవ్వుతూ కనిపిస్తూ ఉండడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో ఆమెకి ఇలాంటి అత్యాచార బెదిరింపు అభిమానులు, కుటుంబ సభ్యులు షాక్ గురవుతున్నారు.

Next Story
Share it